ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rahul Gandhi : మోదీ ప్రస్తావన ఎందుకు?

ABN, Publish Date - Nov 04 , 2024 | 03:30 AM

ప్రధాని మోదీ అంటేనే బోర్‌ కొడుతోందని, ఆయన ప్రస్తావన ఎందుకని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు.

  • ఆయనంటేనే మనందరికీ బోర్‌ కొడుతోంది

  • వయనాడ్‌ ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, నవంబరు 3: ప్రధాని మోదీ అంటేనే బోర్‌ కొడుతోందని, ఆయన ప్రస్తావన ఎందుకని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. తన సోదరి ప్రియాంక గాంధీకి మద్దతుగా వయనాడ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో తొలుత ప్రియాంక మాట్లాడుతూ మోదీకి ప్రజా శ్రేయస్సు కంటే తన మిత్రులైన వ్యాపారవేత్తల ప్రయోజనాలే ఎక్కువని ఆరోపించారు. ప్రజలకు ఉద్యోగ అవకాశాలు, విద్య, వైద్యం, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే ఉద్దేశం మోదీ ప్రభుత్వానికి లేదని, సమాజాన్ని విభజించి, ద్వేషాన్ని వ్యాప్తి చేయడం ద్వారా అధికారంలో కొనసాగడమే వారి లక్ష్యమని ధ్వజమెత్తారు. అనంతరం రాహుల్‌ మాట్లాడుతూ, ‘ప్రియాంక ఎలాగూ మోదీ గురించి ప్రస్తావించారు. ఆయనంటే మనందరికీ బోర్‌ కొడుతోంది. అయినా రెండుసార్లు ఆయన ప్రస్తావన ఎందుకు?’ అని ప్రశ్నించారు. తమ తండ్రి రాజీవ్‌ గాంధీ హత్యకేసులో నిందితురాలు నళినిని కలుసుకొని, కౌగిలించుకున్న వ్యక్తి ప్రియాంక అని కొనియాడారు. దేశంలో ద్వేష రాజకీయాలు కాకుండా ఇలాంటి ప్రేమ, ఆప్యాయతలతో కూడిన రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Updated Date - Nov 04 , 2024 | 03:30 AM