ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rail Roko: నేడు రైల్ రోకో ఉద్యమం.. ఈ ప్రాంతాల్లో ట్రైన్స్ బంద్?

ABN, Publish Date - Mar 10 , 2024 | 07:45 AM

ఈరోజు రైల్ రోకో ఉద్యమానికి రైతులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పంజాబ్-హర్యానా రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రైతులు రైలు పట్టాలపై కూర్చొని నిరసనలు తెలుపనున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు ఈ నిరసన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పలు ట్రైన్స్ రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది.

నేడు (మార్చి 10న) రైతులు పలు రాష్ట్రాల్లో రైల్ రోకో(Rail Roko) ఆందోళనలు నిర్వహించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ రైల్ రోకో ఉద్యమంలో రైతులు(farmers protest) పాల్గొననున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా పంజాబ్(punjab), హర్యానా(haryana)లోని దాదాపు 60 ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య నాలుగు గంటలపాటు ఈ నిరసనలు చేయనున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు.

సంయుక్త కిసాన్ మోర్చా (Samyukta Kisan Morcha), కిసాన్ మజ్దూర్ మోర్చా(Kisan Mazdoor Morcha).. MSP సహా వివిధ డిమాండ్ల కోసం ఈ ఆందోళనలకు సిద్ధమైంది. ఈ క్రమంలో అన్ని పంటలకు కనీస మద్దతు ధర (MSP)కు చట్టపరమైన హామీని అందించాల్సిన బాధ్యతను కేంద్రం మర్చిపోవద్దని రైతు సంఘం నేత జగ్జిత్ సింగ్ దల్లెవాల్ శనివారం వెల్లడించారు. పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని ఎమ్‌ఎస్‌పీతో కొనుగోలు చేయాలన్న కేంద్రం ప్రణాళికను ఇప్పటికే తిరస్కరించినట్లు దల్లెవాల్ చెప్పారు.


ఫిరోజ్‌పూర్‌, మాల్వా ప్రాంతంలో, సంగ్రూర్, ధురి, సునమ్, మాన్సా, పాటియాలా, తపా, మలేర్‌కోట్లా, అమృత్‌సర్‌, రూప్‌నగర్‌, గురుదాస్‌పూర్‌ సహా పంజాబ్‌, హర్యానాలోని పలు జిల్లాల్లో రైతులు రైలు పట్టాలపై కూర్చోవాల్సి వస్తోందని కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా(Kisan Mazdoor Morcha) నాయకుడు సర్వన్‌ సింగ్‌ పంధేర్‌ అన్నారు. ఈ కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.

ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ప్రయాణించేవారు ట్రైన్ల(trains) సమయాన్ని చూసుకుని ప్రయాణించాలని అధికారులు కోరారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ కూడా అప్రమత్తమైంది. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు(police) సిద్ధమవుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Miss World 2024: మిస్ వరల్డ్ 2024 కిరీటం గెల్చుకున్న క్రిస్టినా పిస్కోవా

Updated Date - Mar 10 , 2024 | 07:45 AM

Advertising
Advertising