రైల్వే టికెట్ రిజర్వేషన్ గడువు కుదింపు అమల్లోకి
ABN, Publish Date - Nov 02 , 2024 | 03:20 AM
ప్రయాణికులు అందరూ లబ్ధి పొందేలా రైల్వే తన టికెటింగ్ పాలసీలో మార్పులు చేసింది. ఈ మార్పులు నవంబరు 1, శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి.
న్యూఢిల్లీ, నవంబరు 1: ప్రయాణికులు అందరూ లబ్ధి పొందేలా రైల్వే తన టికెటింగ్ పాలసీలో మార్పులు చేసింది. ఈ మార్పులు నవంబరు 1, శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. గతంలో 120 రోజుల ముందుగా టికెట్లు బుక్ చేసుకొనే సదుపాయం ఉండేది. దానిని 60 రోజులకు కుదిస్తూ రైల్వే తీసుకున్న నిర్ణయం అమలులోకి వచ్చింది. అక్టోబరు 31లోపు రిజర్వేషన్ చేసుకున్న వారికి ఈ మార్పు వర్తించదు. నిర్థారిత ప్రయాణికులను ప్రోత్సహించడానికే ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం గడువును కుదించినట్లు రైల్వే స్పష్టం చేసింది. వాస్తవ డిమాండ్‌ను అర్థం చేసుకోవడానికి ఈ మార్పు ఉపకరిస్తుందని రైల్వే భావిస్తోంది. ముందస్తు రిజర్వేషన్లలో 61 నుంచి 120 రోజుల మధ్యలో సుమారు 21ు రిజర్వేషన్లు రద్దవున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Updated Date - Nov 02 , 2024 | 03:20 AM