ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rains: ఇంకా.. జలదిగ్బంధంలోనే శివారు ప్రాంతాలు..

ABN, Publish Date - Oct 19 , 2024 | 12:48 PM

నగరంలో, శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షం ఆగి మూడు రోజులు దాటినా శివారు ప్రాంతాల్లోని వారంతా ఇంకా జలదిగ్బంధంలో ఉన్నారు. కార్పొరేషన్‌ అధికారుల సమాచారం మేరకు శివారు ప్రాంతాల్లో సుమారు 500 కుటుంబాలు వాననీటిలోనే కాపురం చేస్తున్నారు.

చెన్నై: నగరంలో, శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షం ఆగి మూడు రోజులు దాటినా శివారు ప్రాంతాల్లోని వారంతా ఇంకా జలదిగ్బంధంలో ఉన్నారు. కార్పొరేషన్‌ అధికారుల సమాచారం మేరకు శివారు ప్రాంతాల్లో సుమారు 500 కుటుంబాలు వాననీటిలోనే కాపురం చేస్తున్నారు. నగర శివారు ప్రాంతాలైన చోళవరం, రెడ్‌హిల్స్‌(Cholavaram, Redhills), వేళచ్చేరి, ఆవడి, తాంబరం, ముడిచ్చూరు, ముగిలివాక్కం తదితర ప్రాంతాల్లో ఇళ్లచుట్టూ చేరిన ననీటిలోనే అవస్థలు పడుతున్నారు. రెడ్‌హిల్స్‌ సమీపం కుమరన్‌ నగర్‌ ప్రాంతాల్లో నివసిస్తున్నవారిని అగ్నిమాపక సిబ్బంది రబ్బరు పడవల్లో తరలిస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Actress Gayathri: నటి గాయత్రి సంచలన కామెంట్స్.. ఆ నలుగురూ తోడు దొంగలు


ఇదే విధంగా శ్రీరామ్‌నగర్‌, మీనాక్షి నగర్‌, సన్‌సిటీ మహామేరు నగర్‌, పాడియనల్లూరు, సెంథిల్‌వేలన్‌ నగర్‌ మధురవాయల్‌, వానగరం, అంబత్తూరు పారిశ్రామిక వాడ, తాంబరం సమీపం ముడిచ్చూరు ప్రాంతాల్లోనూ మూడు రోజులుగా వాననీటిలోనే స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఈ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు కూడా నిలిపివేశారు. దీంతో నిత్యావసర సరకుల కోసం స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కార్పొరేషన్‌ కార్మికులు ఈ ప్రాంతాల్లో దోమలబెడద నివారించేం దుకు ఫాగింగ్‌ చేస్తున్నారు.


...........................................................

ఈ వార్తను కూడా చదవండి:

.........................................................

Chennai: అబ్బో.. పైత్యం బాగానే ముదిరిందిగా.. రీల్స్‌ మోహంతో ఆడవేషంలో బైక్‌ రైడింగ్‌..

చెన్నై: వేలూరు(Vellore)లో రీల్స్‌పై మోజుతో ఓ యువకుడు ఆడవేషం ధరించి బైకును అత్యంత వేగంగా నడుపుతున్న దృశ్యాలతో ఓ వీడియో సోషల్‌ మీడియా(Social media)లో వైరల్‌ అవుతోంది. ఆ యువకుడు పొడవైన జడ, పూలు పెట్టుకుని వెనుక నుంచి చూస్తే అందమైన యువతిలాగే వేషం ధరించి ఆ బైకును వేలూరు నగరంలోని పలు ప్రాంతాల్లో నడిపాడు.


కాలేజీ విద్యార్థినులు తిరిగే ప్రాంతాల్లో ఆ బైకును ఒంటి చక్రంతో నడపటం, సైలెన్సర్‌ శబ్దం(Silencer sound) చేస్తూ సవారీ చేశాడు. ఇన్ని సాహసాలు చేసిన ఆ యువకుడు పోలీసులకు పట్టుబడతాననే ముందు జాగ్రత్త బైక్‌ నెంబర్‌ లేకుండా జాగ్రత్త పడ్డాడు. ప్రస్తుతం ఆడవేషంలో బైకును నడిపి అదరగొట్టిన ఆ యువకుడి ఆచూకీ కనుగొని శిక్షించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వీడియో ఆధారంగా అతడికోసం గాలిస్తున్నారు.


ఇదికూడా చదవండి: Cyberabad police: ఆర్‌జే శేఖర్‌ బాషా అరెస్టు..

ఇదికూడా చదవండి: High Court: ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితుడు రాధాకిషన్‌రావు

ఇదికూడా చదవండి: Bhupalpally: సింగరేణి ఓసీపీలతో దినదిన గండం!

ఇదికూడా చదవండి: Tummala: సోనియా పుట్టిన రోజు నాటికి రుణమాఫీ పూర్తి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 19 , 2024 | 12:48 PM