Rains: ఆరు రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం..
ABN, Publish Date - Oct 11 , 2024 | 11:27 AM
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనుండగా, అదే సమయంలో రాష్ట్రంలో శుక్రవారం నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, నగరంలో, సబర్బన్ ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.
- నగరంలో అర్ధరాత్రి కురిసిన వాన
చెన్నై: రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనుండగా, అదే సమయంలో రాష్ట్రంలో శుక్రవారం నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, నగరంలో, సబర్బన్ ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు(Chengalpattu, Kanchipuram, Tiruvallur), తిరువణ్ణామలై, విల్లుపురం, కడలూరు, మైలాడుదురై, తంజావూరు, తిరువారూరు, నాగపటిట్నం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి.
ఈ వార్తను కూడా చదవండి: జమ్మూ-కశ్మీర్ ఎమ్మెల్యేల్లో మహిళలు ముగ్గురే: ఏడీఆర్
కన్నియాకుమారి కడలిలోను, అరేబియా సముద్రతీరం, శ్రీలంక, దాని చుట్టూ ఉన్న ప్రాంతాల్లోనూ ఉపరితల ఆవర్తనం ఏర్పడడం, వీటికి తోడు కచ్చాదీవి, దాని చుట్టూ అరేబియా సముద్ర ప్రాంతం వద్ద అల్పపీడనం కారణంగా మరో ఆరు రోజులపాటు సేలం, కృష్ణగిరి, ధర్మపురి, తిరుపత్తూరు, నామక్కల్, కరూరు, తిరుచ్చి, మదురై, విరుదునగర్, దిండుగల్, తేని(Madurai, Virudhunagar, Dindugal, Theni), రామనాధపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సముద్రతీరాల్లో గంటకు 35 నుంచి 45 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు.
వరద ప్రాంతాల వివరాలివ్వండి..
ఇదిలా ఉండగా ఈశాన్యా రుతుపవన ప్రభావిత వర్షాల కారణంగా వరద పరిస్థితుల ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం కార్పొరేషన్ జోన్ల వారీగా స్థానికులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిస్తే ఎక్కువగా వరదలు సంభవించే ప్రాంతాల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు చెరువులు బాగుపడిందెలా?
ఇదికూడా చదవండి: Yadagirigutta: దసరా నుంచి స్వర్ణతాపడం పనులు
ఇదికూడా చదవండి: Hyderabad: అది పరిహారం కాదు.. పరిహాసం: కేటీఆర్
ఇదికూడా చదవండి: Manda krishna: వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్లు ఇవ్వాలి
Read Latest Telangana News and National News
Updated Date - Oct 11 , 2024 | 11:27 AM