Rain Alert: నవంబర్ 14 వరకు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ అలర్ట్
ABN, Publish Date - Nov 09 , 2024 | 08:15 AM
దేశంలోని ఉత్తర భారతదేశంలో చలి ప్రభావం పెరిగింది. ఇదే సమయంలో మరికొన్ని రాష్ట్రాల్లో తుపాను ప్రభావం ఉందని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది. దీంతో నేటి నుంచి నవంబర్ 14 వరకు వర్షాలున్నట్లు ఐఎండీ తెలిపింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా అనేక చోట్ల చలి కారణంగా పొగమంచు పెరిగింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం వాయు కాలుష్యం కారణంగా ఉష్ణోగ్రత 30 నుంచి 32 మధ్య ఉంటుంది. దీంతో చలి అనుభూతి కలగకపోవడంతో అక్కడి ప్రజలు తేమతో ఇబ్బంది పడుతున్నారు. అయితే వాతావరణ శాఖ ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా పలు రాష్ట్రాల్లో(rains) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ కారణంగా దక్షిణ భారతదేశంలోని 4 తీరప్రాంత రాష్ట్రాల్లో నేటి నుంచి నవంబర్ 14 వరకు వర్ష సూచనలు ఉన్నాయని అంచనా వేసింది.
ఈ రాష్ట్రాలకు వర్ష సూచన
ఈ నేపథ్యంలో నవంబర్ 14 వరకు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) ‘ఆరెంజ్’ అలర్ట్ ప్రకటించింది. దీంతో కేరళలోని తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' జారీ చేశారు. పుదుచ్చేరిలోని మహే, యానాం, కారైకల్‌లో కూడా వర్షం పడే అవకాశం ఉంది. దీంతో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో కూడా మేఘాలు కమ్ముకునే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది.
మరికొన్ని రాష్ట్రాల్లో
ఈ తుపాను ప్రభావంతో పెద్ద ఎత్తున గాలులు వీస్తాయని వెదర్ రిపోర్ట్ చెప్పింది. ప్రతికూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులు కేరళ-లక్షద్వీప్ తీరంలో చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. నవంబర్ 9-10, 11 తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. నవంబర్ 12-13, 14 తేదీల్లో తమిళనాడు, కేరళ, మహే, పుదుచ్చేరి, కారైకల్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభావం ఉండవచ్చని అంచనా వేసింది.
ఈ ప్రాంతాల్లో చలి
లా నినా చురుకుగా ఉండటం వల్ల భారతదేశంలో ప్రధానంగా ఉత్తర భారతదేశం ఈ సంవత్సరం సాధారణం కంటే చలిగా ఉంటుందని గ్లోబల్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ అంచనా వేసింది. డిసెంబరు మొదటి వారంలో పసిఫిక్ మహాసముద్రంలో లా నినా ప్రభావంతో సముద్ర ఉపరితలం చల్లగా ఉంటుందని తెలిపింది. అప్పుడు సముద్రం నుంచి వచ్చే గాలులు భారతదేశాన్ని తాకుతాయని దీంతో నవంబర్‌లో బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో చలికాలం ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందన్నారు.
నవంబర్ 20 వరకు
ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో చలి మొదలైంది. నవంబర్ 21 తర్వాత దట్టమైన పొగమంచు కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోవచ్చు. నవంబర్ 20 వరకు ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 32 నుంచి 33 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 18 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈరోజు ఢిల్లీ ఏక్యూఐ 361గా నమోదైంది.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
PPF Account: ఉపయోగించని మీ పీపీఎఫ్ ఖాతాను ఇలా యాక్టివేట్ చేసుకోండి..
Life Certificate 2024: మీ పెన్షన్ ఆగకుడదంటే ఇలా చేయండి.. కొన్ని రోజులే గడువు..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Read More National News and Latest Telugu News
Updated Date - Nov 09 , 2024 | 08:19 AM