ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rains: రామనాథపురంలో కుండపోత.. స్తంభించిన జనజీవనం

ABN, Publish Date - Nov 21 , 2024 | 11:14 AM

రామనాథపురం(Ramanathapuram) జిల్లాలో మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఉరుములు, మెరుపులు, పెనుగాలుతో కుండపోతగా వర్షాలు కురువటంతో జనజీవనం స్తంభించింది. ఆ జిల్లాలోని ప్రధాన రహదారుల్లో వర్షపునీరు ప్రవహించింది.

చెన్నై: రామనాథపురం(Ramanathapuram) జిల్లాలో మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఉరుములు, మెరుపులు, పెనుగాలుతో కుండపోతగా వర్షాలు కురువటంతో జనజీవనం స్తంభించింది. ఆ జిల్లాలోని ప్రధాన రహదారుల్లో వర్షపునీరు ప్రవహించింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. దక్షిణ అండమాన్‌ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, బంగాళాఖాతంలో పెనుగాలుల కారణంగా రామనాథపురం పరిసర ప్రాంతాల్లో గత రెండు రోజులుగా వర్షాలు కురిశాయి.

ఈ వార్తను కూడా చదవండి: Air Pollution: తగ్గిన వాయు కాలుష్యం తీవ్రత.. నగర వాసులకు కాస్తా ఉపశమనం..


మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు రామేశ్వరం, తంగచ్చిమఠం, పాంబన్‌(Rameshwaram, Thangachi Math, Pamban) తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. రామనాథస్వామి ఆలయ మాఢవీధుల్లో వర్షపునీరు వరదలా ప్రవహించింది. రామేశ్వరం, పాంబన్‌ తదితర తీర ప్రాంతాల్లో అలల ఉధ్రుతి అధికమైంది. సుమారు ఐదు మీటర్ల ఎత్తున అలలు తీరం వైపు ఎగసిపడ్డాయి. అలల తాకిడి అధికం కావటంతో జాలర్లు బుధవారం చేపలవేటకు వెళ్లలేదు.


ఇదేవిధంగా రామనాథపురం, పరమకుడి, తిరువట్టానై, ఆర్‌ఎస్‌ మంగళం, కీళ్‌కరై, ముదుగళత్తూరు, కముది, కడలాడి, సత్తిరకుడి తదితర ప్రాంతాల్లో బుధవారం ఉదయం కూడా ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షం కారణంగా జిల్లాలోని విద్యాలయాలకు రామనాధపురం కలెక్టర్‌ సిమ్రన్‌జిత్‌ సింగ్‌(Collector Simranjit Singh) సెలవు ప్రకటించారు. ఇదిలా ఉండగా మండపం ఉత్తర ఓడరేవు ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి పెనుగాలులతో భారీ వర్షాలు కురిశాయి. ఆ సమయంలో తీరం ఒడ్డున లంగరేసిన 15 మరపడవలు అలలతాకిడి ఎగిరి పడి ధ్వంసమయ్యాయి. దీంతో జాలర్లు తీవ్ర ఆందోళన చెందారు.


ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ క్యాడర్‌ ప్రాసిక్యూటర్ల సంఘం అధ్యక్షుడిగా రాంరెడ్డి

ఈవార్తను కూడా చదవండి: Midday Meal: మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌

ఈవార్తను కూడా చదవండి: TET: ముగిసిన టెట్‌ గడువు..22 వరకు ఎడిట్‌ ఆప్షన్‌

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: సీఎం రేవంత్ పర్యటన.. రోడ్డెక్కిన దళిత సంఘాల నాయకులు..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 21 , 2024 | 11:14 AM