ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rajnath Singh: అగ్నివీరులపై ప్రకటనకు రెడీ.. రాహుల్‌ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ అభ్యంతరం

ABN, Publish Date - Jul 29 , 2024 | 05:57 PM

అగ్నివీర్ చక్రాయుధంలో యువత చిక్కుకున్నారని, అగ్నివీరుల పెన్షన్‌కు బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు జరపలేదని విపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విపక్ష నేత ఎప్పుడు కోరినా సభలో సమగ్ర ప్రకటనకు తాను సిద్ధమన్నారు.

న్యూఢిల్లీ: అగ్నివీర్ (Agniveer) 'చక్రాయుధం' (Chakrayudh)లో యువత చిక్కుకున్నారని, అగ్నివీరుల పెన్షన్‌కు బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు జరపలేదని విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రసంగం ముగిసిన వెంటనే రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో స్పందిస్తూ, అగ్నివీర్ పథకంపై దేశాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. విపక్ష నేత ఎప్పుడు కోరితే అప్పడు సభ ముందు సమగ్ర ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.


''జాతీయ భద్రత అంశా చాలా సున్నితమైనది. అగ్నివీర్ జవాన్లకు సంబంధించి దేశాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు (స్పీకర్) ఎప్పుడు అదేశిస్తే అప్పుడు అగ్నివీర్ సోల్జర్స్‌ అంశంపై సభలో ప్రకటన చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను'' అని రాజ్‌నాథ్ అన్నారు. ఆయన మాట్లాడుతుండగా మధ్యలో రాహుల్ గాంధీ అమరవీరుల నష్టపరిహారం అంశాన్ని లేవనెత్తారు. జమ్మూకశ్మీర్‌లోని నౌషెరాలో మందుపాతర పేలి గత జనవరిలో మరణించిన అగ్నివీర్‌కు ఇన్‌సూరెన్స్ ఇచ్చారనే కానీ, ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వలేదన్నారు.

Rahul Gandhi: బీజేపీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలను వెన్నుపోటు పొడిచింది.. రాహుల్ గాంధీ ధ్వజం


బీజేపీ 'చక్రాయుధం'

దీనికి ముందు, సభలో రాహుల్ మాట్లాడుతూ బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజానీకానికి ద్రోహం చేసిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆధునిక చక్రవ్యూహాన్ని నిర్మించిందని, అందులో రైతులు, మధ్యతరగతి ప్రజలు, సమాజంలోని ఇతర వర్గాల వారు చిక్కుకున్నారని అన్నారు. పద్మవ్యూహం కమలాకారంలో ఉంటుందన్నారు. కమలం పార్టీ దేశంలో అధికారంలో ఉందని, రైతులు భయపడుతున్నారని, అన్నారు. కమలం పద్మవ్యూహాన్ని మోదీ, అమిత్‌షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, అంబానీ, అదానీ వంటి వారు కంట్రోల్ చేస్తున్నారని అన్నారు. స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేసుకోవడంతో రాహుల్ తిరిగి స్పందిస్తూ...'' మీరు కోరితే ఎన్ఎస్ఏ, అంబానీ, అదానీ పేర్లు మినహాయించి, తక్కిన మూడు పేర్లు తీసుకుంటాను'' అని అన్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jul 29 , 2024 | 06:10 PM

Advertising
Advertising
<