ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rajnath Singh: 125 ఏళ్లు ఆయన బతకాలి, మోదీ అంతకాలం పాలించాలి

ABN, Publish Date - Sep 30 , 2024 | 06:04 PM

నరేంద్ర మోదీని గద్దె దింపేవరకూ తాను చనిపోనంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై మాటల యుద్ధం జరుగుతోంది. దీనిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్యానాలో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో స్పందించారు.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని గద్దె దింపేవరకూ తాను చనిపోనంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) చేసిన వ్యాఖ్యలపై మాటల యుద్ధం జరుగుతోంది. దీనిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) హర్యానాలో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో స్పందించారు. మల్లికార్జున్ ఖర్గే 125 ఏళ్లు బతకాలని, ప్రధాని మోదీ 125 ఏళ్లు ప్రధానిగానే ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు.


మల్లికార్జున్ ఖర్గే జమ్మూకశ్మీర్‌లోని కథువాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. వేదికపై స్పృహతప్పి పడిపోతున్న తరుణంలో భద్రతా సిబ్బంది, ఇతర కాంగ్రెస్ నాయకులు ఆయన దగ్గరకు వెళ్లిపట్టుకున్నారు. కొద్దిసేపు ప్రసంగాన్ని నిలిపివేసిన అనంతరం తిరిగి ఖర్గే మాట్లాడుతూ, మోదీని గద్దె దింపేవరకూ తాను చనిపోనంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం తన వయస్సు 83 ఏళ్లని, ఇప్పుడిప్పుడే చనిపోనంటూ వ్యాఖ్యానించారు.

Maharashtra: ఆవును 'రాజ్యమాత'గా ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం


కాగా, ఖర్గే వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సోమవారంనాడు తప్పుపట్టారు. ఖర్గే తన వ్యక్తిగత ఆరోగ్య విషయాన్ని మోదీతో ముడిపెట్టి మాట్లాడటం ఏమాత్రం హుందాగా లేదన్నారు. ప్రధాని మోదీ అంటే భయం, ద్వేషం కాంగ్రెస్‌లో గూడు కట్టుకట్టుకుందనడానికి ఇదో ఉదాహరణ అని అన్నారు. ఖర్గే చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని తాను, మోదీతో సహా అంతా ప్రార్ధిస్తామని, 2047 వికసిత్ భారత్‌ను ఖర్గే చూడాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం

ఇది కూడా చదవండి..

BJP : జమిలిపై ముందుకే!

Updated Date - Sep 30 , 2024 | 06:26 PM