ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jagdeep Dhankhar: రాజ్యసభ నుంచి చైర్మన్‌ వాకౌట్‌!

ABN, Publish Date - Aug 09 , 2024 | 04:50 AM

రాజ్యసభలో గురువారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సాక్షాత్తూ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ సభ నుంచి వాకౌట్‌ చేయడం కలకలం సృష్టించింది.

  • ఎగువ సభలో అనూహ్య ఘటన

న్యూఢిల్లీ, ఆగస్టు 8: రాజ్యసభలో గురువారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సాక్షాత్తూ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ సభ నుంచి వాకౌట్‌ చేయడం కలకలం సృష్టించింది. సాధారణంగా విపక్షాలు ప్రభుత్వంపై నిరసనతో వాకౌట్‌ చేస్తుంటాయి. అయితే ధన్‌ఖడ్‌ విపక్షాల తీరుపై అసహనంతో సభ నుంచి వెళ్లిపోవడం గమనార్హం. ఉదయం సభ ప్రారంభం కాగానే.. పారిస్‌ ఒలింపిక్స్‌లో రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌పై అనర్హత వేటు అంశంపై చర్చకు ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర విపక్షాల నేతలు పట్టుబట్టారు.


ఆ సమయంలో కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్‌ తనను చూసి నవ్వడాన్ని చైర్మన్‌ ధన్‌ఖడ్‌ భరించలేకపోయారు. ‘మీ అలవాటు నాకు తెలుసు. ఇక్కడ నన్ను కాదు.. చైర్మన్‌ స్థానాన్నే సవాల్‌ చేస్తున్నారు. అందులో కూర్చున్న నాకు విలువ లేదన్న భావనతోనే చాలెంజ్‌ చేస్తున్నారు’ అని ఆక్షేపించారు. విపక్షాల వైపు నుంచి మళ్లీ రన్నింగ్‌ కామెంట్రీ రావడంతో ధన్‌ఖడ్‌ జైరాం వైపు చూసి స్పందించారు. తను ఈ చైర్‌లో కూర్చోవాలనిపించడం లేదంటూ లేచి నిల్చుని రెండు చేతులూ జోడించి సభ నుంచి వాకౌట్‌ చేసేశారు.

Updated Date - Aug 09 , 2024 | 04:50 AM

Advertising
Advertising
<