ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

New York: ఇండియా డే పరేడ్‌లో అయోధ్య రాముడి ప్రతిరూపం.. న్యూయార్క్‌లో ప్రదర్శించనున్న వీహెచ్‌పీ

ABN, Publish Date - Jul 03 , 2024 | 03:36 PM

ఇండియా డే పరేడ్‌లో(India Day Parade in New York) భాగంగా ఏటా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నిర్వహించే ఇండియా డే పరేడ్‌లో ఈ సారి చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఆగస్టు 18న జరిగే ఇండియా డే పరేడ్‌లో అయోధ్యలోని రామ మందిర రూపం న్యూయార్క్ వీధుల్లో ప్రదర్శితం అవుతుంది.

ఢిల్లీ: ఇండియా డే పరేడ్‌లో(India Day Parade in New York) భాగంగా ఏటా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నిర్వహించే ‘ఇండియా డే పరేడ్‌’లో ఈ సారి చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఆగస్టు 18న జరిగే ఇండియా డే పరేడ్‌లో అయోధ్యలోని రామ మందిర రూపం న్యూయార్క్ వీధుల్లో ప్రదర్శితం కాబోతుంది. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో పాటు చుట్టుపక్కల వారిని ఆకర్షించనుందనే అంచనాలు నెలకొన్నాయి.

కాగా అయోధ్య రాముడి రూపాన్ని అమెరికాలో ప్రదర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆలయ ప్రతిరూపం 18 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తుతో ఉంటుందని విశ్వహిందూ పరిషత్ అమెరికా (VHPA) ప్రధాన కార్యదర్శి అమితాబ్ మిట్టల్ తెలిపారు. న్యూయార్క్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వందలాది మంది అమెరికన్-భారతీయులు ఇందులో పాల్గొంటారని వివరించారు.


ఇండియా డే పరేడ్ అంటే..

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని1981 నుంచి ఏటా ఆగస్టు 15న భారతీయ అమెరికన్లు కవాతు నిర్వహిస్తున్నారు. న్యూయార్క్‌లో జరిగే ఈ పరేడ్.. దేశం వెలుపల జరిగే అతి పెద్ద భారత దేశ వేడుక. మిడ్‌టౌన్ న్యూయార్క్‌లోని ఈస్ట్ 38వ వీధి నుంచి ఈస్ట్ 27వ వీధి వరకు జరిగే వార్షిక కవాతును సాధారణంగా 1,50,000లకుపైగా ప్రజలు వీక్షిస్తారు.

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) ద్వారా ప్రతి సంవత్సరం ఇండియా డే పరేడ్ నిర్వహిస్తారు. ఈ కవాతులో వివిధ భారతీయ-అమెరికన్ కమ్యూనిటీలు న్యూయార్క్ వీధుల్లో కనిపిస్తాయి.


ఈ సమయంలో భారతీయులు వారికి స్వాగతం పలుకుతూ త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తారు. గతేడాది 41వ ఇండియా డే పరేడ్‌కు రవిశంకర్, నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాజరయ్యారు. అయితే జనవరి 22న అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగింది. ఈ సారి రాముడి ప్రతిరూపం కవాతులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

For Latest News and National News click here

Updated Date - Jul 03 , 2024 | 03:50 PM

Advertising
Advertising