ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bengaluru: రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితుడు ఇతడే..?

ABN, Publish Date - Mar 07 , 2024 | 01:17 PM

బెంగళూర్‌ రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో అధికారులు పురోగతి సాధించారు. ఐఈడీ బాంబ్ పెట్టిన వ్యక్తికి సంబంధించి కీలక ఆధారం లభించిందని పేర్కొన్నారు. బాంబ్ పెట్టిన అనుమానితుడి ఫొటో బీఎంటీసీ బస్సులో మాస్క్ లేకుండా కనిపించింది. కేఫ్ పేలుడులో కీలక ఆధారం లభించిందని కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర ప్రకటించిన మరుసటి రోజు అధికారులు ఫొటోను విడుదల చేశారు.

బెంగళూర్: బెంగళూర్‌ రామేశ్వరం కేఫ్ పేలుడు (Rameshwaram Cafe Blast) ఘటనలో అధికారులు పురోగతి సాధించారు. ఐఈడీ బాంబ్ పెట్టిన వ్యక్తికి సంబంధించి కీలక ఆధారం లభించిందని వెల్లడించారు. బాంబ్ పెట్టిన అనుమానితుడు ఫొటో బీఎంటీసీ బస్సులో మాస్క్ లేకుండా కనిపించింది. కేఫ్ పేలుడులో కీలక ఆధారం లభించిందని కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర ప్రకటించిన మరుసటి రోజు అధికారులు ఫొటోను (Photo) విడుదల చేశారు. దీంతోపాటు అనుమానితుడి స్కెచ్‌ను పోలీసులు (Police) వేయిస్తున్నారు. ఆ స్కెచ్ మాత్రం విడుదల చేయలేదు. అనుమానితుడికి సంబంధించి ఇటీవల సీసీటీవీ ఫుటేజీ కూడా విడుదలయిన సంగతి తెలిసిందే.

రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును సీసీఎస్ పోలీసులు విచారించారు. తర్వాత ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు. మంగళవారం పేలుడు జరిగిన హోటల్‌ను ఎన్ఐఏ అధికారులు పరిశీలించారు. హోటల్ సిబ్బందిని పలు ప్రశ్నలు వేశారు. బాంబ్ పెట్టిన నిందితుడి గురించి సమాచారం తెలియజేస్తే రూ.10 లక్షల రివార్డ్ అందజేస్తామని ప్రకటన చేశారు. వివరాలు తెలియజేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 07 , 2024 | 02:46 PM

Advertising
Advertising