ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ECI: సూర్జేవాలాపై ఈసీ చర్య... 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంపై వేటు

ABN, Publish Date - Apr 16 , 2024 | 06:53 PM

బాలీవుడ్ నటి, బీజేపీ సిట్టింగ్ ఎంపీ హేమమాలినిపై 'అభ్యంతరకర' వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలాపై భారత ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా ఆయనపై వేటు వేసింది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది.

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, బీజేపీ సిట్టింగ్ ఎంపీ హేమమాలినిపై 'అభ్యంతరకర' వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా (Randeep Surjewala)పై భారత ఎన్నికల కమిషన్ (ECI) చర్యలు తీసుకుంది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా ఆయనపై వేటు వేసింది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది.

Lok Sabha Polls 2024: తొలి దశ పోలింగ్‌కు ఈసీ సన్నాహాలు


''భారత రాజ్యాంగంలోని 324వ అధికరణ, ఇతర అధికారాల కింద 16 ఏప్రిల్ 2024 సాయంత్రం 6 గంటల నుంచి 48 గంటల పాటు ఆయన ఎలాంటి ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనరాదు. ఊరేగింపులు, పబ్లిక్ ర్యాలీలు, రోడ్‌షోలు, ఇంటర్వ్యూలు, మీడియాకు దూరంగా ఉండాలి'' అని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది. మధుర ఎంపీ హేమమాలినిని అగౌరవపరచేలా సూర్జేవాలా వ్యాఖ్యలు చేశారంటూ ఈసీకి బీజేపీ ఇటీవల ఫిర్యాదు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం గత నెలలో సూర్జేవాలాకు షోకాజ్ నోటీసు ఇచ్చింది.

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 16 , 2024 | 06:53 PM

Advertising
Advertising