ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mamata Banerjee: మళ్లీ బెంగాల్ డీజీపీగా రాజీవ్‌కుమార్‌

ABN, Publish Date - Jul 15 , 2024 | 08:43 PM

పశ్చిమ బెంగాల్ డీజీపీగా మళ్లీ రాజీవ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్‌లో రాజీవ్‌కుమార్‌ను మమత ప్రభుత్వం డీజీపీగా నియమించింది.

West Bengal DGP Rajeev Kumar

కోల్‌కతా, జులై 15: పశ్చిమ బెంగాల్ డీజీపీగా మళ్లీ రాజీవ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్‌లో రాజీవ్‌కుమార్‌ను మమత ప్రభుత్వం డీజీపీగా నియమించింది. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆ పోస్ట్ ‌నుంచి ఆయన్ని కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది. ఆ స్థానంలో రాజీవ్‌కుమార్ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ సంజయ్ ముఖర్జీని బెంగాల్ డీజీపీగా నియమించింది.

ఇక లోక్‌సభ ఎన్నికల ఇటీవల పూర్తయ్యాయి. అలాగే రాష్ట్రంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు సైతం మొన్నటితో ముగిశాయి. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసింది. ఈ నేపథ్యంలో రాజీవ్‌కుమార్‌ను బెంగాల్ డీజీపీగా నియమిస్తూ..మమత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు డీజీపీగా వ్యవహరించిన సంజయ్ ముఖర్జీ.. తిరిగి అగ్నిమాపక శాఖ డీజీగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Also Read: Bihar: రష్యా సైన్యానికి హజీపూర్ బూట్లు.. పెరుగుతున్న డిమాండ్

Also Read: Iskcon: డోనాల్డ్ ట్రంప్‌ను జగన్నాథుడే కాపాడాడు

Also Read: Arvind Kejriwal: ఆరోగ్యంపై స్పందించిన తీహాడ్.. తొసిపుచ్చిన ఆప్


ఇక ఐపీఎస్ రాజీవ్ కుమార్‌ వివాదాస్పద అధికారిగా పేరు పొందారు. కోట్లాది రూపాయిల శారదా స్కామ్‌లో సీబీఐ సైతం ఆయనపై ఆరోపణలు గుప్పించింది. అంతేకాదు ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజీవ్ కుమార్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. 2019లో కోల్‌కతా పోలీస్ కమిషనర్‌గా ఆయన వ్యవహరించారు. ఆ సమయంలో రాజీవ్ కుమార్ నివాసంలో సీబీఐ తనిఖీలు సైతం నిర్వహించింది.

మరోవైపు 2016 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. రాజీవ్ కుమార్ కోల్‌కతా కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆయనను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది. ఆ ఎన్నికల్లో మమత పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో మమత మళ్లీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే... రాజీవ్ కుమార్‌ను తిరిగి ఆ పోస్ట్‌లో నియమించింది.

Also Read: Priyanka Gandhi: నిద్ర నుంచి మేల్కోవాలంటూ మోదీకి చురకలు

Also Read:Donald Trump: ఆఫీసర్.. ఆఫీసర్ అన్నా పట్టించుకోలేదా?

Also Read: Pune Police: పరారీలో పూజా ఖేద్కర్ తల్లిదండ్రులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 15 , 2024 | 08:56 PM

Advertising
Advertising
<