ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RG Kar Hospital Case: సీబీఐకి చుక్కెదురు.. సంజయ్ రాయ్‌కు నార్కోటెస్ట్‌ నిరాకరించిన కోర్టు

ABN, Publish Date - Sep 13 , 2024 | 06:36 PM

సీల్దా కోర్టులో శుక్రవారం జరిగిన క్లోజ్డ్ డోర్ హియరింగ్‌‌‌లో నార్కో టెస్ట్‌కు ఏదైనా అభ్యంతరం ఉందా అని జడ్జి నేరుగా రాయ్‌ని అడిగారు. అయితే తన సమ్మతిని తెలిపేందుకు రాయ్ నిరాకరించాడు.

కోల్‌కతా: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రెయినీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ (Sanjay Roy)పై నార్కో టెస్ట్ (Narco test) జరిపేందుకు కోల్‌కతా కోర్టు సీబీఐ (CBI)కి అనుమతి నిరాకరించింది. నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు నార్కోటెస్ట్‌కు అనుమతించాలని కోల్‌కతా కోర్టును సీబీఐ ఇంతకుముందు అభ్యర్థించింది. సీల్దా కోర్టులో శుక్రవారం జరిగిన క్లోజ్డ్ డోర్ హియరింగ్‌‌‌లో నార్కో టెస్ట్‌కు ఏదైనా అభ్యంతరం ఉందా అని జడ్జి నేరుగా రాయ్‌ని అడిగారు. అయితే తన సమ్మతిని తెలిపేందుకు రాయ్ నిరాకరించాడు.


ఆర్డీ కర్ మెడికల్ కాలేజీలోని సెమినార్ హాలులో ట్రయినీ వైద్యురాలి మృతదేహం కనిపించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలన సృష్టించడంతో ఆ మరుసటి రోజే ఆగస్టు 10న సంజయ్‌ రాయ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్నించి కోల్‌కతా ప్రెసిడెన్సీ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో రాయ్ ఉన్నాడు. బెయిలు కోరుతూ అతను చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు గత వారం తోసిపుచ్చింది. సెప్టెంబర్ 20 వరకూ అతని జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది.

Port Blair Renamed: పోర్ట్ బ్లెయిర్ ఇకనుంచి శ్రీ విజయపురం.. ప్రకటించిన అమిత్‌షా


ఫోరెన్సిక్ సాక్ష్యంపై సీబీఐ దృష్టి

కాగా, కేసు దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ సాక్ష్యాలపై సీబీఐ దృష్టి సారించింది. హతురాలి మృతదేహంపై కొరుకుడు ముద్రలు (బైట్ మార్క్స్) కనిపించడంతో వాటితో పోల్చిచూసేందుకు సంజయ్ రాయ్‌ నుంచి దంత ముద్రలు, లాలాజలం నమూనాలను సీబీఐ సేకరించింది. నేరానికి సంబంధించిన కీలక సాక్ష్యాలను కనుగొనడం, విశ్లేషించే విషయంలో సీబీఐకి కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ సహకరిస్తోంది.


Read MoreNational News and Latest Telugu New

Also Read:Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్.. ఆప్ నేతల్లో వెల్లివిరిసిన ఆనందం

Updated Date - Sep 13 , 2024 | 06:38 PM

Advertising
Advertising