Maharashtra Assembly Elections: ఓటేసిన సచిన్, అక్షయ్, రితేష్
ABN, Publish Date - Nov 20 , 2024 | 11:05 AM
మహారాష్ట్రతోపాటు జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. చలి ఎక్కువగా ఉండటంతో ఉదయం పూట పోలింగ్ తక్కువగా నమోదైంది. మహారాష్ట్రలో ఉదయం 9 కేవలం 6.61 శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది.
ముంబై: మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సరిగ్గా ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. జార్ఖండ్ అసెంబ్లీకి రెండో విడత పోలింగ్, ఉత్తరప్రదేశ్‌లో ఉప ఎన్నిక జరుగుతోంది. మహారాష్ట్ర కన్నా జార్ఖండ్ ప్రజలు ఓటు వేసేందుకు ఆసక్తి కనబరిచారు. ఉదయం 9 గంటల వరకు జార్ఖండ్ ఓటింగ్ శాతం కాస్తా ఎక్కువగా ఉంది.
ఓటేసిన సెలబ్రిటీలు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సెలబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీ తారలు, ప్రముఖ క్రికెటర్లు, నేతలు క్యూ లైన్‌లో నిల్చొని ఓటు వేశారు. మేం ఓటేశాం.. మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ‘పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరు ఓటు వేయండి. అన్నింటి కన్నా ముఖ్య విషయం ఓటు వేయడం అని’ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కోరారు.
వజ్రాయుధం..
నా బాధ్యతను నేను నిర్వర్తించా. ఓటు అనేది ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు. ఇళ్ల నుంచి బయటకొచ్చి అందరూ ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించుకోవాలి అని’ మరో హీరో రాజ్ కుమార్ రావు పిలుపునిచ్చారు.
సచిన్, రితేష్
క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్ కూతురుతో వచ్చి ఓటు వేశారు. భార్య జెనీలియాతో కలిసి నటుడు రితేష్ దేశ్‌ముఖ్ పోలింగ్ కేంద్రానికి వచ్చారు. దర్శకుడు ఫర్హాన్ అకర్త్, జొయా అక్తర్, రష్మీ నిగమ్, సోను సూద్, సినీ దర్శకుడు కబీర్ ఖాన్, సీనియర్ నటి సుభా ఖొటే కూతురుతో వచ్చి ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం సిరా గుర్తును మీడియాకు చూపించారు.
ఇవి కూడా చదవండి:
Chrome Browser: గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను సేల్ చేస్తున్నారా.. అమెరికా ప్రభుత్వం..
Viral News: మీటింగ్‌కు రాలేదని 90% ఉద్యోగులను తొలగించిన సీఈఓ.. నెటిజన్ల కామెంట్స్
Read More Business News and Latest Telugu News
Updated Date - Nov 20 , 2024 | 11:05 AM