Sandeshkhali: సందేశ్‌ఖాళిలో షేక్ షాజహాన్ అండ్ కో ఆగడాలు.. ఎన్‌హెచ్ఆర్సీ రిపోర్టులో సంచలన విషయాలు
ABN, Publish Date - Apr 14 , 2024 | 08:25 PM
సందేశ్‌ఖాళిలో టీఎంసీ బహిష్కృత నేత షేక్ షాజహాన్ అండ్ కో చేసిన ఆగడాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ ఏం జరిగిందనే అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు పర్యటించి నివేదిక రూపొందించారు. ఆ రిపోర్టులో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి.
ఢిల్లీ: సందేశ్‌ఖాళిలో (Sandeshkhali) టీఎంసీ బహిష్కృత నేత షేక్ షాజహాన్ (Sheikh Shahjahan) అండ్ కో చేసిన ఆగడాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ ఏం జరిగిందనే అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు పర్యటించి నివేదిక రూపొందించారు. ఆ రిపోర్టులో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి.
PM Modi: అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అవమానించింది.. కాంగ్రెస్‌పై మోదీ విసుర్లు
శిబు ప్రసాద్ హజరా, ఉత్తమ్ సర్దార్, అమీర్ అలీ ఘజి తదితరులు షేక్ షాజహాన్ ఆదేశాలతో పనిచేశారని నివేదించింది. పార్టీ మీటింగ్ ఉందని, లేదంటే స్వయం సహాయక సమావేశం ఉందని సందేశ్ ఖాళికి చెందిన మహిళలను పిలిపించేవారట. అలా వచ్చారో ఇక అంతే సంగతులు. వారిని రాత్రి వరకూ అక్కడే ఉంచేవారనే కఠోర నిజం తెలిసింది. మహిళలతో అసభ్యంగా మాట్లాడేవారని వివరించారు. ఆ మహిళలల్లో కాస్త అందంగా ఉన్నవారిని టార్గెట్ చేసే వారని తెలిసింది. వారిని పార్టీ కార్యాలయం లోపలికి తీసుకెళ్లి లైంగికదాడి చేసేవారని వివరించారు. మిగతా మహిళలు వండటం, ఆఫీసు గదిని శుభ్రపరిచే పనులు చేపట్టేవారని వెల్లడించారు.
షాజహాన్ అండ్ కో నుంచి ఫోన్లు వస్తే ఆ మహిళలకు ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే రావాల్సిందే. ఇంటిలోని వారికి బాగోలేదని చెబితే ఊరుకునేవారు కాదట. కాదు కూడదాని కచ్చితంగా రాకుంటే ఇంటికొచ్చి ఆ మహిళలతోపాటు కుటుంబ సభ్యులను కొట్టుకొని పార్టీ ఆఫీసుకు తీసుకొని వెళ్లేవారని తెలిసింది. జనవరి 1 2024 నుంచి ఫిబ్రవరి 25 2024 వరకు ముగ్గురు మైనర్ బాలికలు, 37 మంది మహిళలతో మాట్లాడి రిపోర్ట్‌ను రూపొందించామని పేర్కొన్నారు.
Maratha Reservation row: ఆమరణ నిరాహార దీక్షకు మనోజ్ జారంగే అల్టిమేటం
మరిన్ని జాతీయ వార్తల కోసం
Updated Date - Apr 14 , 2024 | 08:25 PM