ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rahul Gandhi: రాహుల్ గాంధీ ఒప్పుకోవాలే గానీ.. అభ్యంతరం దేనికి?

ABN, Publish Date - Jun 05 , 2024 | 09:47 PM

‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు? అనేది మళ్లీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే.. ఆ ప్రశ్నకు ఇప్పుడిప్పుడే సమాధానం దొరికేలా కనిపించడం లేదు.

Sanjay Raut Comments On Rahul Gandhi As INDIA PM Face

‘ఇండియా’ కూటమి (INDIA Alliance) ప్రధాని అభ్యర్థి ఎవరు? అనేది మళ్లీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే.. ఆ ప్రశ్నకు ఇప్పుడిప్పుడే సమాధానం దొరికేలా కనిపించడం లేదు. అయితే.. తాజాగా శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) మాత్రం ఆ విషయంపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రధాని కావాలనే ఆలోచనకు ఆయన మద్దతు తెలిపారు. రాహుల్ అందుకు సిద్ధంగా ఉంటే.. తాము ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయమని ఖరాఖండీగా తేల్చి చెప్పారు. బుధవారం ఓ మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘ఒకవేళ రాహుల్ గాంధీ నాయకత్వం అంగీకరించేందుకు సిద్ధంగా ఉంటే.. మేము ఎందుకు అభ్యంతరం చెప్తాం? తాను జాతీయ నాయకుడినని ఆయన ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. మన దేశంలో ఉన్న అత్యంత ప్రజాదరణ నాయకుల్లో రాహుల్ ఒకరు. మేము ఆయన్ను ఎంతగానో అభిమానిస్తాం. రేపు ఎన్డీఏ కన్నా ఇండియా పరిస్థితి మెరుగ్గా ఉండి, ప్రధాని పదవి చేపట్టేందుకు ముందుకు వస్తే.. ఏ ఒక్కరూ అభ్యంతరం వ్యక్తం చేయరు. కూటమిలో ఎలాంటి విభేదాలు లేవు’’ అని సంజయ్ రౌత్ చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రారంభం నుంచి కూటమిలో ప్రధాని పదవిపై ఎలాంటి విభేదాలు లేవని.. బీజేపీ నియంతృత్వ పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యంగాన్ని కాపాడేందుకు ఈ కూటమి ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని అన్నారు.


ఇదే సమయంలో.. ప్రధాని నరేంద్ర మోదీపై సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. మోదీ తన గౌరవాన్ని కోల్పోయారని, మోదీ బ్రాండ్ పూర్తిగా పడిపోయిందని, అలాంటి ప్రధాని ఇప్పుడు దేశానికి అవసరం లేదని విమర్శించారు. ఒకవేళ రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ తమ ఇండియా కూటమికి మద్దతు తెలిపితే.. వాళ్లను సాదరంగా ఆహ్వానిస్తామని అన్నారు. ఆ ఇద్దరు ఎల్లప్పుడూ ప్రజాస్వామ్యానికి మద్దతు తెలిపారని పేర్కొన్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 05 , 2024 | 09:47 PM

Advertising
Advertising