మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Supreme Court: సుప్రీంకోర్టులో రాందేవ్ బాబాకు చుక్కెదురు..!!

ABN, Publish Date - Apr 21 , 2024 | 04:37 PM

సుప్రీంకోర్టులో యోగా గురువు రాందేవ్ బాబాకు చుక్కెదురైంది. రాందేవ్ బాబాకు చెందిన పతంపలి యోగ్ పీఠ్ ట్రస్ట్ రూ.4.5 కోట్లు చెల్లించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ అభయ్ ఎస్ ఒకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం అలహాబాద్ కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది.

Supreme Court: సుప్రీంకోర్టులో రాందేవ్ బాబాకు చుక్కెదురు..!!
SC Asks Ramdev's Patanjali Trust To Pay Rs 4.5 Cr Tax For Charging Entry Fees At Yoga Camps

ఢిల్లీ: సుప్రీంకోర్టులో యోగా గురువు రాందేవ్ బాబాకు (Ramdev Baba) చుక్కెదురైంది. రాందేవ్ బాబాకు చెందిన పతంపలి యోగ్ పీఠ్ ట్రస్ట్ రూ.4.5 కోట్లు చెల్లించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ అభయ్ ఎస్ ఒకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం అలహాబాద్ కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది.

Ramdev Baba: మీరంత అమాయకులేం కాదు.. రాందేవ్‌పై సుప్రీం ఫైర్


ఏం జరిగిందంటే..?

రాం దేవ్ బాబాకు చెందిన యోగ్ పీఠ్ ద్వారా యోగా క్యాంపులు నిర్వహిస్తుంటారు. యోగా క్యాంపులకు వచ్చే వారి నుంచి డబ్బులు వసూల్ చేస్తారు. మీరట్‌కు చెందిన కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. దానిని రాం దేబ్ బాబా అలహాబాద్ కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో సవాల్ చేశారు. యోగా పేరుతో డబ్బులు వసూల్ చేయడం ఆరోగ్యం, ఫిట్ నెస్ కిందకు వస్తోంది. సేవా విభాగం కింద పన్ను చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 2006 మార్చి నుంచి 2011 వరకు నిర్వహించిన క్యాంపులతో రూ.4.5 కోట్ల సేవా పన్ను విధించింది. దాంతో రాందేవ్ బాబా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ నిరాశ తప్పలేదు. ఆ రూ.4.5 కోట్లు చెల్లించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.


సేవా పన్ను

పతంజలి ట్రస్ట్ రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ ప్రాంతాల్లో యోగా క్యాంపులు నిర్వహించే వారు. ఆ శిబిరాల్లో పాల్గొన్న వారి నుంచి విరాళాల రూపంలో డబ్బు వసూల్ చేశారు. అది సేవ కిందకు వస్తుందని, సేవా పన్ను చెల్లించాలిని కస్టమ్స్ ఎక్సైజ్ విభాగం అంటోంది. అది సేవా పన్ను కిందకు రాదని పతంజలి వాదిస్తోంది. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో కూడా రాందేవ్ బాబా కంపెనీకి చుక్కెదురు అయ్యింది.

Rajastan: భారత్‌ను కాంగ్రెస్ ఎన్నడూ బలోపేతం చేయదు.. ప్రధాని మోదీ ధ్వజం

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 21 , 2024 | 04:37 PM

Advertising
Advertising