Supreme Court: సీఎం పదవి నుంచి తప్పుకోమనడానికి మీరెవరు.. కేజ్రీవాల్‌కి సుప్రీం కోర్టులో భారీ ఊరట
ABN, Publish Date - May 13 , 2024 | 05:20 PM
కేజ్రీవాల్‌ని(CM Arvind Kejriwal) ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని వేసిన పిటిషన్‌ని సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) సోమవారం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఢిల్లీ: కేజ్రీవాల్‌ని(CM Kejriwal) ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని వేసిన పిటిషన్‌ని సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) సోమవారం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌ని ఈడీ, సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఇటీవలే బెయిల్‌పై బయటకి వచ్చారు.
అయితే జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని పేర్కొంటూ కాంతి భాటీ అనే వ్యక్తి ఏప్రిల్‌లో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.
పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించడంతో ఆయన సుప్రీం తలుపు తట్టారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
కేజ్రీవాల్‌ని సీఎం పదవి నుంచి తొలగించాలని అడిగే చట్టపరమైన హక్కు పిటిషనర్‌కి లేదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీంతో కేజ్రీవాల్‌కి భారీ ఊరట లభించినట్లైంది.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Updated Date - May 13 , 2024 | 05:20 PM