Jammu And Kashmir: నేటితో ముగియనున్న రెండవ దశ ఎన్నికల ప్రచారం
ABN, Publish Date - Sep 23 , 2024 | 12:54 PM
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. అందులోభాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు ర్యాల్లీల్లో పాల్గొనున్నారు. ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. బుధవారం రాష్ట్రంలోని 26 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
శ్రీనగర్, సెప్టెంబర్ 23: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అందులోభాగంగా సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జమ్మూ కశ్మీర్ రానున్నారు. పూంచ్‌తోపాటు శ్రీనగర్‌లో నిర్వహించే భారీ ర్యాలీలో ఆయన పాల్గొనున్నారు.
Viral News: తనను కిడ్నాప్ చేసిన వారికి శిక్ష పడేలా చేసిన యువకుడు.. అదీ 17 ఏళ్ల తర్వాత.. ఎలాగంటే..?
మొత్తం 26 అసెంబ్లీ స్థానాలకు..
ఈ రోజు సాయంత్రం 5.00 గంటలతో రెండో దశ ఎన్నికల ప్రచారం పరిసమాప్తం కానుంది. సెప్టెంబర్ 25వ తేదీన జమ్మూ కశ్మీర్‌లో రెండో దశ పోలింగ్ జరగనుంది. ఈ దశలో జమ్మూలోని రియాసీ, రాజౌరీ, పూంఛ్ జిల్లాలతోపాటు కాశ్మీర్ లోయలోని శ్రీనగర్, బుద్గాం జిల్లాలోని మొత్తం 26 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో తొలి దశ ఎన్నికల పోలింగ్ సెప్టెంబర్ 18న పూర్తయింది. ఈ ఎన్నికల్లో 60 శాతం పోలింగ్ నమోదయిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక అక్టోబర్ 1వ తేదీన రాష్ట్రంలో మూడో విడత పోలింగ్ జరగనుంది.
Also Read: Bhagwant Mann: స్థానిక సంస్థల ఎన్నికల వేళ పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం
Also Read: Hyderabad: పలు ప్రాంతాల్లో నేడు మంచి నీటి సరఫరా బంద్
ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు
2019లో ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ ఓటరు ఏ పార్టీకి పట్టం కడతాడనే అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతోపాటు పలువురు కేంద్ర మంత్రులు ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Also Read: Narendra Modi: యూఎస్‌లో మరో రెండు భారతీయ రాయబార కార్యాలయాలు ఏర్పాటు
అందుకే ఇంజనీర్ రషీద్ విడుదల..
అయితే ఈ ఎన్నికల్లో ఓట్లు చీల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అందుకు ఇంజనీర్ రషీద్‌ను బెయిల్‌పై విడుదలయ్యారంటూ ప్రధాన ప్రతిపక్షం నేషనల్ కాన్ఫరెన్స్‌తోపాటు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8వ తేదీన వెలువడనున్నాయి.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 23 , 2024 | 12:54 PM