Lok Sabha Elections: రాజ్‌నాథ్ నియోజకవర్గంలో మే 17 వరకూ 144 సెక్షన్
ABN, Publish Date - Mar 19 , 2024 | 09:34 PM
లోక్‌సభ ఎన్నికలు, పండుగల సీజన్ కావడంతో మే 17వ తేదీ వరకూ ఉత్తరప్రదేశ్‌లోని లక్నో లో 144 సెక్షన్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. శాంతిభద్రత విభాగం జేసీపీ ఉపేంద్ర కుమార్ ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు.
లక్నో: లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha polls), పండుగల సీజన్ కావడంతో మే 17వ తేదీ వరకూ ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని లక్నో (Lucknow)లో 144 సెక్షన్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. శాంతిభద్రత విభాగం జేసీపీ ఉపేంద్ర కుమార్ ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు, హోలి, రంజాన్ వంటి పండుగల సీజన్ల కారణంగా సెక్షన్ 144 అమలుకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఐదవ విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మే 20న లక్నోలో పోలింగ్ జరుగనుంది.
లక్నో నుంచి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, ఆయనపై సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి రవిదాస్ మేహరోత్రా పోటీలో ఉన్నారు. 1991 నుంచి బీజేపీకి కంచుకోటగా లక్నో ఉంది. రాజ్‌నాథ్ సింగ్ 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచే గెలుపొందారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 19 , 2024 | 09:34 PM