ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: నువ్వో శక్తిస్వరూపిణివి.. ఓ అరాచకవాదిని జైలుకు పంపావ్‌!

ABN, Publish Date - Mar 27 , 2024 | 01:58 AM

పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హట్‌ ఎంపీ టికెట్‌ పొందిన సందేశ్‌ఖాలీ బాధితురాలు రేఖా పత్రాకు ప్రధాని మోదీ నేరుగా ఫోన్‌ చేశారు.

PM Modi Call To Rekha

  • సందేశ్‌ఖాలీ బాధితురాలు, బసిర్‌ హట్‌ బీజేపీ అభ్యర్థి రేఖా పత్రాతో ఫోన్‌లో మోదీ

న్యూఢిల్లీ, మార్చి 26: పశ్చిమ బెంగాల్‌లోని(West Bengal) బసిర్‌హట్‌ ఎంపీ టికెట్‌ పొందిన సందేశ్‌ఖాలీ బాధితురాలు రేఖా పత్రాకు ప్రధాని మోదీ(PM Modi) నేరుగా ఫోన్‌ చేశారు. ఎన్నికల సన్నాహాలు ఎలా ఉన్నాయంటూ ఆరా తీశారు. రేఖా అభ్యర్థిత్వంపై స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. బెంగాలీలో ఫోన్‌ సంభాషణ మొదలుపెట్టిన మోదీ.. ‘దుర్గా పూజకు నెలవైన బెంగాల్‌లో నువ్వో శక్తి స్వరూపిణివి. ఓ అరాచకవాదిని జైలుకు పంపావ్‌. ఎన్నికల్లో మీ మీద పెద్ద బాధ్యత ఉంచాం. మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. మహిళల గౌరవం కోసం బసిర్‌హట్‌లోనే కాదు. యావత్‌ బెంగాల్‌లోనూ పోరాటం సాగిద్దాం’ అని సూచించారు.

సందేశ్‌ఖాలీలో మహిళలు గొంతెత్తగలగడం సామాన్య విషయం కాదని, తృణమూల్‌ పాలనతో విసిగిపోయిన బెంగాల్‌ నారీశక్తి ఈసారి తమకు అండగా ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిగా రేఖా పత్రా స్పందిస్తూ ‘‘మీరు మా పాలిట దేవుడిలా వచ్చారు. ఆ శ్రీరాముడే మాతో ఉన్నట్లుగా భావిస్తున్నాం. 2011 నుంచి ఇక్కడ ఎవరం ఓటు వేయలేదు. ఈ సారి హక్కును వినియోగించుకునేలా భద్రత కల్పించండి’’ అని కోరారు. సందేశ్‌ఖాలీలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు షాజహాన్‌ షేక్‌, అతడి అనుచరులు మహిళలపై లైంగిక వేధింపులు, భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

అరెస్టు చేసేందుకు వెళ్లిన ఈడీ అధికారులపై షాజహాన్‌ అనుచరులు దాడికి కూడా పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సందేశ్‌ఖాళీలో జరుగుతున్న దారుణాలను, వాటికి తృణమూల్‌ మద్దతు ఇస్తుండడాన్ని మోదీ ఇప్పటికే పలుసార్లు ప్రస్తావించారు. కాగా, బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీని ఎదుర్కొనేందుకు సందేశ్‌ఖాలీని బీజేపీ ఓ ఆయుధంగా ఎంచుకుంది. ఈ కమ్రంలో షాజహాన్‌ అకృత్యాలపై మహిళలు సాగించిన ఆందోళనలకు నాయకత్వం వహించిన రేఖా పత్రాను బసిర్‌హట్‌ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. సందేశ్‌ఖాలీ ఈ నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది. తృణమూల్‌ తరఫున ఇక్కడినుంచి హజీ నరుల్‌ ఇస్లామ్‌ పోటీ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 27 , 2024 | 06:57 AM

Advertising
Advertising