Share News

Anna Sebastian: సెబీ జోసఫ్‌ను కలిసిన ఎంపీ శశిథరూర్

ABN , Publish Date - Sep 21 , 2024 | 10:24 AM

తీవ్ర పని ఒత్తిడితో యర్నెస్ట్ అండ్ యంగ్‌లో చార్టెడ్ అకౌటెంట్‌గా విధులు నిర్వహిస్తున్న 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ అధిపతికి ఆమె తల్లి అనిత సెబాస్టియ్ లేఖ రాశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 Anna Sebastian: సెబీ జోసఫ్‌ను కలిసిన ఎంపీ శశిథరూర్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: తీవ్ర పని ఒత్తిడితో యర్నెస్ట్ అండ్ యంగ్‌లో చార్టెడ్ అకౌటెంట్‌గా విధులు నిర్వహిస్తున్న 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ అధిపతికి ఆమె తల్లి అనిత సెబాస్టియ్ లేఖ రాశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ క్రమంలో అన్నా సెబాస్టియన్ తండ్రి సెబీ జోసఫ్‌ను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఇటీవల కలిశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కీలక సూచనలను ఎంపీ తన ఎక్స్ వేదికగా శనివారం వివరించారు.

Also Read: Delhi CM: నేడు సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం


అన్ని పని ప్రదేశాల్లో పని గంటలకు ఓ నిర్ణీత క్యాలెండర్ విధానం ఉండాలని అన్నా సెబాస్టియన్ తండ్రి సెబీ జోసఫ్ పేర్కొన్నారన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో అన్ని పని ప్రదేశాల్లో రోజుకు 8 గంటలు పని చేసేలా ఓ నియమం తప్పక ఉండాలని పేర్కొన్నారని చెప్పారు. అలా వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు ఉండాలన్నారని తెలిపారు. పని ప్రదేశాల్లో మానవ హక్కుల సంస్థల జోక్యం సైతం ఉండాలని చెప్పారన్నారు.

Also Read: Kolkata: ముగిసిన సమ్మె.. నేటి నుంచి విధుల్లోకి జూనియర్ డాక్టర్లు


అందుకు సంబంధించి పార్లమెంట్‌లో చట్టం చేసేలా చర్యలు తీసుకోవాలని తనకు ఆయన సూచించారన్నారు. అందుకు తాను సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తొలి అంశంగా దీనిపై చర్చిస్తానని సెబీ జోసఫ్‌తో పేర్కొన్నట్లు శశిథరూర్ తెలిపారు. సెబీ జోసఫ్‌తో మాట్లాడుతున్నప్పుడు ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని ఎంపీ పేర్కొన్నారు. ఇది హృదయ విదారకమైన ఘటన అన్ని తెలిపారు.


కేరళకు చెందిన 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ చార్టెడ్ అకౌంటెంట్ కోర్సు పూర్తి చేసింది. ఈ ఏడాది మార్చి 19వ తేదీన పుణెలోని ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థలో చేరారు. సంస్థ ఆమెకు వీక్ ఆఫ్ సైతం ఇవ్వ లేదు. దీంతో తీవ్ర పని ఒత్తిడికి ఆమె గురయ్యారు. ఆ క్రమంలో జులైలో గుండె పోటుతో అన్నా సెబాస్టియన్ మృతి చెందింది. ఇదే విషయాలన్ని వివరిస్తూ యర్నెస్ట్ అండ్ యంగ్‌ సంస్థ అధిపతికి తల్లి అనిత సెబాస్టియన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే.

For More National News And Telugu News...

Updated Date - Sep 21 , 2024 | 10:47 AM