Share News

Mumbai: షిర్డీ ఆలయ భద్రతపై మాక్‌ డ్రిల్‌

ABN , Publish Date - Dec 13 , 2024 | 05:49 AM

షిర్డీ సాయిబాబా ఆలయ భద్రతపై అధికారులు మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. ఒకవేళ ఉగ్రవాదులు ప్రవేశిస్తే వారిని ఎదుర్కొనేందుకు సిబ్బంది సన్నద్ధత ఎలా ఉండాలనే విషయమై ఈ మాక్‌ డ్రిల్‌ జరిగింది.

Mumbai: షిర్డీ ఆలయ భద్రతపై మాక్‌ డ్రిల్‌

  • పాల్గొన్న ఎన్‌ఎ్‌సజీ, ఫోర్స్‌ వన్‌ సిబ్బంది

ముంబయి, డిసెంబరు 12: షిర్డీ సాయిబాబా ఆలయ భద్రతపై అధికారులు మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. ఒకవేళ ఉగ్రవాదులు ప్రవేశిస్తే వారిని ఎదుర్కొనేందుకు సిబ్బంది సన్నద్ధత ఎలా ఉండాలనే విషయమై ఈ మాక్‌ డ్రిల్‌ జరిగింది. బుధవారం రాత్రి 11 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం గురువారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌ఎ్‌సజీ) కమెండోలు, ఉగ్రవాద నిరోధక చర్యల కోసం ప్రత్యేకంగా ఏర్పాటయిన మహారాష్ట్ర పోలీసు విభాగంలోని ‘ఫోర్స్‌ వన్‌’ సిబ్బంది, స్థానిక పోలీసులు ఇందులో పాల్గొన్నారు.


ఒకవేళ ఉగ్రవాదులు దాడులు చేస్తే వారిని అదుపు చేసేందుకు ఎలా వ్యవహరించాలనేదానిపై కసరత్తు చేశారు. వారికి సహాయంగా విపత్తు నిర్వహణ, అగ్నిమాపక దళం, వైద్య, రెవెన్యూ సిబ్బంది కూడా వచ్చారు. అలాంటి పరిస్థితి వస్తే వివిధ విభాగాల మధ్య ఎలాంటి సమన్వయం ఉండాలన్నదానిపైనా అవగాహన కలిగించారు. అంతకుముందు ఎన్‌ఎ్‌సజీకి చెందిన 150 మంది కమెండోలు అహిల్యానగర్‌ కాలేజీ ఆవరణలో కవాతు నిర్వహించారు.

Updated Date - Dec 13 , 2024 | 05:49 AM