ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kochi : కాంగ్రెస్‌లో ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’

ABN, Publish Date - Sep 02 , 2024 | 03:28 AM

కాంగ్రెస్‌ పార్టీ కేరళ శాఖలో పెద్ద వివాదం నెలకొంది. సినిమా పరిశ్రమలో మాదిరిగానే కాంగ్రెస్‌లోనూ ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ బెడద ఉందని ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకురాలు సిమీ రోస్‌బెల్‌ జాన్‌ ఆరోపించారు.

  • కేరళ నాయకురాలి ఆరోపణ.. పార్టీ నుంచి బహిష్కరణ

కోచి, సెప్టెంబరు 1: కాంగ్రెస్‌ పార్టీ కేరళ శాఖలో పెద్ద వివాదం నెలకొంది. సినిమా పరిశ్రమలో మాదిరిగానే కాంగ్రెస్‌లోనూ ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ బెడద ఉందని ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకురాలు సిమీ రోస్‌బెల్‌ జాన్‌ ఆరోపించారు. పార్టీలో మహిళలు లైంగిక దోపిడీకి గురవుతున్నారని విమర్శించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆమెను బహిష్కరించింది.

ఎర్నాకుళానికి చెందిన రోస్‌భెల్‌ శనివారం ఓ చానెల్‌తో మాట్లాడుతూ.. పార్టీలో మహిళలను లైంగికంగా వేధిస్తున్నారంటూ ప్రతిపక్ష నేత వి.డి.సతీశన్‌ సహా పలువురిపై ఆరోపణలు చేశారు. నాయకుల మెప్పు పొందేవారికే ముఖ్యమైన పదవులు దక్కుతున్నాయని అన్నారు. రోస్‌బెల్‌ ఆరోపణలను సతీశన్‌ ఖండించారు. ఆమెకు ఏఐసీసీ పదవులు దక్కాయని గుర్తు చేశారు. మీడియా ముందు మహిళా నేతలను కించపరిచినందుకు రోస్‌బెల్‌ను ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరిస్తున్నట్టు పార్టీ నాయకత్వం ప్రకటించింది.

Updated Date - Sep 02 , 2024 | 03:29 AM

Advertising
Advertising