ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Crime: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు అగ్నికి ఆహుతి..

ABN, Publish Date - Feb 25 , 2024 | 02:06 PM

ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కౌశాంబిలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు దర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి.

ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కౌశాంబిలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు దర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫ్యాక్టరీలో చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. కాగా ఫ్యాక్టరీలో 15 నుంచి 20 మంది వరకు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పేలుడు శబ్ధం కొన్ని కిలోమీటర్ల మేర వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

అగ్నిప్రమాదం కారణంగా ఫ్యాక్టరీలో మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది నీటితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున స్పాట్ కు చేరుకున్నారు. దీంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రమాదానికి గల కారణాలను ఇప్పుడే చెప్పలేమని ఓ పోలీసు అధికారి తెలిపారు.

ఈ బాణాసంచా ఫ్యాక్టరీ చాలా కాలం నుంచి టపాసులను తయారు చేస్తోంది. అయితే.. ఫ్యాక్టరీ యాజమాన్యం లైసెన్స్ తీసుకున్నారా లేదా అనే అంశంపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 25 , 2024 | 02:59 PM

Advertising
Advertising