ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Smriti Irani: ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి

ABN, Publish Date - Aug 29 , 2024 | 02:20 PM

ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయన్నారు. కానీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అమేఠీలో తాను ఓటమి పాలైనా.. అసలు విజయం మాత్రం తనదేనని ఆమె స్పష్టం చేశారు. అమేఠీ లోక్‌సభ సభ్యురాలిగా గతంలో ఆ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ఈ సందర్బంగా స్మృతి ఇరానీ సోదాహరణగా వివరించారు.

న్యూఢిల్లీ, ఆగస్ట్ 28: ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ లోక్‌సభ స్థానం గాంధీ కుటుంబానికి కంచుకోట అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి అమేఠీపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమేఠీ.. తన మనోభావాలకు, సైద్దాంతికానికి సంబంధించిన అంశమని ఆమె పేర్కొన్నారు. గురువారం న్యూఢిల్లీలో స్మృతి ఇరానీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Also Read: Kolkata: సీఎం నివాసంపై దాడికి కుట్ర: అయిదుగురు అరెస్ట్


ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి..

ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయన్నారు. కానీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అమేఠీలో తాను ఓటమి పాలైనా.. అసలు విజయం మాత్రం తనదేనని ఆమె స్పష్టం చేశారు. అమేఠీ లోక్‌సభ సభ్యురాలిగా గతంలో ఆ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ఈ సందర్బంగా స్మృతి ఇరానీ సోదాహరణగా వివరించారు.

ఆ నియోజకవర్గ పరిధిలోని లక్ష కుటుంబాలు.. తమ సొంత ఇంట్లో నివాసిస్తున్నాయన్నారు. దాదాపు 80 వేలకు పైగా నివాసాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు. అలాగే రెండు లక్షల కుటుంబాలకు గ్యాస్ సిలండర్లు సరఫరా అవుతుందని చెప్పారు.

Also Read: ఆన్‌లైన్ పాస్ పోర్ట్ సేవలు కొద్ది రోజుల పాటు బంద్


అమేఠీలో నాడు - నేడు..

తమ ఎంపీని ఎప్పుడు చూడలేదంటూ అమేఠీ ప్రజలు గతంలో ఆరోపించిన సందర్బాలు ఉన్నాయన్నారు. కానీ తాను అమేఠీ ఎంపీగా ఎప్పుడు ఆ నియోజకవర్గాన్ని మాత్రం విస్మరించ లేదన్నారు. అమేఠీలో ఇల్లు సైతం కొనుగోలు చేసినట్లు ఈ సందర్బంగా స్మృతి ఇరానీ వివరించారు. 2019 ఎన్నికల్లో అమేఠీ నుంచి గెలుపొందిన అనంతరం ఆ నియోజకవర్గంలో పర్యటించానన్నారు.

ఆ సమయంలో అమేఠీలో నెలకొన్న పరిస్థితులను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. అమేఠీలో ఓటమిపై తాను బాధపడడం లేదన్నారు. అయినా.. ఎన్నికలన్న తర్వాత ఓటమి అన్నది సహాజమని.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి్ సైతం ఎన్నికల్లో ఓడిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.

Also Read: Gujarat Rains: ఇంటి పైకి చేరిన మొసలి


ఢిల్లీ ముఖ్యమంత్రి బీజేపీ అభ్యర్థి రేసులో..

అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి బీజేపీ అభ్యర్థిగా స్మతి ఇరానీ పేరు ప్రచారంలో ఉందంటూ జరుగుతున్న చర్చపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. ప్రజలకు సేవ చేసేందుకు తాను ఎల్లప్పుడు ముందుంటానని తెలిపారు. ఎంపీగా మూడు సార్లు పని చేశానని ఆమె తెలిపారు. అలాగే బీజేపీలో సైతం పలు కీలక పదవుల్లో తాను పని చేసిన విషయాన్ని స్మృతి ఇరానీ వివరించారు.

Also Read: Jharkhand: ‘ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర’


2024 లోక్ సభ ఎన్నికలు..

ఈ ఎన్నికల్లో అమేఠీ నుంచి స్మృతి ఇరానీ బరిలో దిగారు. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గాంధీ కుటుంబానికి సన్నిహితుడు కె.ఎల్. శర్మను బరిలో నిలిచి.. గెలిచారు. ఇక గత ఎన్నికల్లో అమేఠీ నుంచి పోటీ చేసి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓటమి పాలయ్యారు. అవే ఎన్నికల్లో కేరళలోని వయనాడ్‌ నుంచి ఆయన బరిలో దిగి... గెలిచారు.

Also Read: Haryana: సీఎం వ్యవహారంపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్

ఇక 2024 ఎన్నికల్లో సైతం వయనాడ్ నుంచి గెలిచిన రాహుల్.. రాయబరేలి నుంచి పోటికి దిగి విజయం సాదించారు. దీంతో వయనాడ్ ఎంపీ సీటుకు రాహుల్ రాజీనామా చేసిన విషయం విధితమే.

Also Read: External Affairs Ministry :పాస్ట్‌పోర్ట్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం.. ఎన్ని రోజులంటే..

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 29 , 2024 | 02:20 PM

Advertising
Advertising