ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దక్షిణాదికి దండన!

ABN, Publish Date - Nov 11 , 2024 | 05:05 AM

జనసంఖ్య విషయంలో భారతదేశం చైనాను దాటేసి అగ్రస్థానానికి చేరుకుంది! అయినా.. ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్‌ పిలుపునివ్వడం సంచలనం సృష్టించింది!!

  • జనాభాను నియంత్రించినప్పటికీ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా నష్టం

  • 5 రాష్ట్రాల్లో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య

  • 20 శాతానికి వృద్ధాప్య డిపెండెన్సీ నిష్పత్తి

  • ఉత్తరాదితో పోలిస్తే ఆరోగ్య ఖర్చులు అధికం

  • నియోజకవర్గాల పునర్విభజనతోనూ నష్టం

న్యూఢిల్లీ, నవంబరు 10: జనసంఖ్య విషయంలో భారతదేశం చైనాను దాటేసి అగ్రస్థానానికి చేరుకుంది! అయినా.. ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్‌ పిలుపునివ్వడం సంచలనం సృష్టించింది!! నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదితో పోలిస్తే అధిక జనాభా ఉండే ఉత్తరాది రాష్ట్రాల ఎంపీ సీట్లు పెరుగుతాయన్న ఆగ్రహం స్టాలిన్‌దైతే.. యువ జనాభా తగ్గిపోవడం వల్ల కలిగే నష్టాలపై ఆందోళన చంద్రబాబుది. మొదట్నుంచీ జనాభా నియంత్రణ విషయంలో ముందంజలో ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో.. వృద్ధుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ (యూఎన్‌ఎ్‌ఫపీఏ), ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ (ఐఐపీఎస్‌) ఇటీవల విడుదల చేసిన ‘ఇండియా 2023 ఏజింగ్‌ రిపోర్ట్‌’ ప్రకారం.. 2021లో దేశ జనాభాలో 10.1 శాతంగా ఉన్న వృద్ధుల (60ఏళ్లు దాటినవారి) సంఖ్య 2036 నాటికి 15 శాతానికి, 2050 నాటికి 20 శాతానికి పెరగనుంది.

అంటే ఇప్పటితో పోలిస్తే అప్పటికి దేశ జనాభాలో యువకుల సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య ఎక్కువయిపోతుందన్నమాట. విద్య, వైద్యం వంటి విషయాల్లో దేశంలోనే పురోగామి రాష్ట్రంగా పేరొందిన కేరళలో 2021 నాటికే వృద్ధుల జనాభా 16.5 శాతానికి చేరింది. 2036 నాటికి వారి సంఖ్య 22.8 శాతానికి చేరుతుందని యూఎన్‌ఎ్‌ఫపీఏ అంచనా. ఏపీలో ఈ రేటు 19 శాతంగా ఉండగా.. తమిళనాట 20.8 శాతంగా ఉంది. అదే 2021 సంవత్సరానికి బిహార్‌ జనాభాలో వృద్ధుల సంఖ్య 7.7 శాతమే!


యువ జనాభా సంఖ్య అధికంగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలను ఎల్లప్పుడూ పొందుతూ ఉండాలంటే.. అందుకు సంపూర్ణ సంతాన సాఫల్య రేటు (టీఎ్‌ఫఆర్‌- ఒక మహిళ సగటున కనే పిల్లల సంఖ్య) కీలకం. 1950లో భారతదేశ సంపూర్ణ సంతాన సాఫల్య రేటు సగటు 6.1గా ఉండేది. జనాభా నియంత్రణకు చేపట్టిన చర్యల కారణంగా 2015-16 నాటికి 2.2కు.. ప్రపంచబ్యాంకు డేటా ప్రకారం 2022 నాటికి 2.01కి పడిపోయింది.ఇది జాతీయ సగటు. వాస్తవానికి ఇది 2.1గా ఉండాలి. దేశంలో.. బిహార్‌ (2.98), మేఘాలయ (2.91), ఉత్తరప్రదేశ్‌ (2.35), ఝార్ఖండ్‌ (2.26), మణిపూర్‌ (2.17) రాష్ట్రాల్లో మాత్రమే ఈ రేటు జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉంది. భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ కార్యాలయం గణాంకాల ప్రకారం.. తమిళనాట ఈ రేటు 1.4గా ఉండగా.. ఏపీ, తెలంగాణ, కేరళలో 1.5గా ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం దక్షిణాది రాష్ట్రాలన్నింటి టీఎ్‌ఫఆర్‌ 1.8 కన్నా తక్కువగా ఉంది.

ఏపీ, కర్ణాటకలో 1.7 కన్నా తక్కువగా ఉంది. డెమొగ్రఫీ డివిడెండ్‌ను పొందడానికి యువ జనాభా ఎక్కువగా ఉండడమే కాదు.. వృద్ధుల సంఖ్యే కాదు.. వృద్ధాప్య డిపెండెన్సీ నిష్పత్తి (ఓఏడీఆర్‌) తక్కువగా ఉండడమూ ముఖ్యమే. ఓఏడీఆర్‌ అంటే.. ప్రతి 100 మంది జనాభాలో పనిచేసే వయసులో ఉన్న (18 నుంచి 59 ఏళ్ల) జనాభా, వృద్ధుల నిష్పత్తి. ఆ నిష్పత్తి 15 దాటితే ప్రమాదం. కానీ, యూఎన్‌ఎ్‌ఫపీఏ 2023 నివేదిక ప్రకారం ఈ నిష్పత్తి దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపు 20% దాకా ఉంది.


దీంతో.. జనాభాను సమర్థంగా నియంత్రించి ఎంతో వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు.. ఇప్పుడు తగ్గుతున్న యువకులు, పెరుగుతున్న వృద్ధుల సంఖ్యతో కలత చెందుతున్నాయి. వృద్ధుల ఆరోగ్య ఖర్చులు గణనీయంగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ‘ద హిందు’ వార్తాపత్రికలో ఇటీవల వచ్చిన ఒక కథనం ప్రకారం.. 2017-18లో దేశవ్యాప్తంగా వృద్ధులకు సంబంధించి హృద్రోగాల చికిత్సకు పెట్టిన మొత్తం ఖర్చులో దక్షిణాది రాష్ట్రాల వ్యయం 32%(జనాభాలో ఈ రాష్ట్రాల వాటా కేవలం 20%)గా ఉండగా.. ఉత్తరాదిన హిందీ మాట్లాడే 8రాష్ట్రాల (దేశ జనాభాలో సగం ఈ రాష్ట్రాల్లోనే ఉన్నారు) వ్యయం కేవలం 24 శాతం మాత్రమే కావడం గమనార్హం.

  • సీట్లూ తగ్గుతాయ్‌!

దేశ ప్రయోజనాల నిమిత్తం జనాభా నియంత్రణలో చురుగ్గా వ్యవహరించిన పాపానికి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పార్లమెంటు సీట్ల సంఖ్య పెంపుపై ఉన్న స్తంభన.. 2026 నాటికి ముగుస్తుంది. ఆ తర్వాత.. తాజా జనగణన ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాల్సి ఉంటుంది. దీనివల్ల సహజంగానే జనాభా అధికంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు భారీగా పెరుగుతాయి. ఉదాహరణకు.. నాలుగు ప్రధాన రాష్ట్రాలైన యూపీ, బిహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 174 నుంచి 284కు పెరుగుతుందని అంచనా. అదే సమయంలో దక్షిణాదిన కొన్ని రాష్ట్రాలకు ఉన్న సీట్లే పోయే ప్రమాదం ఉంది. ఫలితంగా దేశ రాజకీయాల్లో, విధానపరమైన నిర్ణయాలను ప్రభావితం చేయడంలో.. దక్షిణాది రాష్ట్రాల మాటకు విలువ లేకుండా పోయే ముప్పుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిఽధలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది.

Updated Date - Nov 11 , 2024 | 05:05 AM