Share News

Akhilesh resign: అసెంబ్లీకి రాజీనామా చేసిన అఖిలేష్ యాదవ్, అయోధ్య ఎంపీ

ABN , Publish Date - Jun 12 , 2024 | 05:20 PM

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని కర్హాల్ అసెంబ్లీ సభ్యత్వానికి బుధవారంనాడు రాజీనామా చేశారు. కన్నౌజ్ లోక్‌సభ స్థానానికి అఖిలేష్ యాదవ్ ఇటీవల ఎన్నిక కావడంతో ఎంపీ పదవిలో కొనసాగేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Akhilesh resign: అసెంబ్లీకి రాజీనామా చేసిన అఖిలేష్ యాదవ్, అయోధ్య ఎంపీ

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఉత్తరప్రదేశ్‌లోని కర్హాల్ (Karhal) అసెంబ్లీ సభ్యత్వానికి (MLA) బుధవారంనాడు రాజీనామా (Resign) చేశారు. కన్నౌజ్ లోక్‌సభ స్థానానికి అఖిలేష్ యాదవ్ ఇటీవల ఎన్నిక కావడంతో ఎంపీ పదవిలో కొనసాగేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అఖిలేష్‌తో పాటు ఫైజాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అవదేశ్ ప్రసాద్ (Awadesh Prasad) సైతం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇరువురి నేతల రాజీనామా లేఖలు తమకు అందినట్టు లెజిస్లేటివ్ అసెంబ్లీ కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్ డూబే ధ్రువీకరించారు.

Naveen Patnaik greets Chandrababu: మీ అభివృద్ధి విజన్ సాకారం కావాలి.. చంద్రబాబుకు నవీన్ పట్నాయక్ అభినందనలు


అఖిలేష్ యాదవ్ 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కర్హాల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అప్పట్నించి రాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ నియోజకవర్గంలో 1,70,99 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి సుబ్రత్ పాఠక్‌‌పై అఖిలేష్ ఘనవిజయం సాధించడంతో పార్లమెంటు సీటును ఉంచుకుని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు మంగళవారంనాడు నిర్ణయించుకున్నారు. పార్టీ కార్యకర్తలతో సంప్రదించే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకు ఆయన తెలిపారు. అసెంబ్లీలో విపక్ష నేతగా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంపై అడిగినప్పుడు పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కాగా, సమాజ్‌వాద్ పార్టీ తరఫున లోక్‌సభా పక్ష నాయకుడిగా అఖిలేష్ ఉంటారని ఆ పార్టీ సైతం ప్రకటించింది.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 12 , 2024 | 05:20 PM