Special trains: పండుగల సందర్భంగా చెన్నై ఎగ్మూర్-విశాఖపట్టణం ప్రత్యేక రైళ్లు
ABN, Publish Date - Sep 04 , 2024 | 12:37 PM
విజయదశమి, దీపావళి పండుగల సందర్భంగా చెన్నై ఎగ్మూర్-విశాఖపట్టణం, విశాఖపట్టణం-కొల్లం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
చెన్నై: విజయదశమి, దీపావళి పండుగల సందర్భంగా చెన్నై ఎగ్మూర్-విశాఖపట్టణం, విశాఖపట్టణం-కొల్లం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
- నెం.08557 విశాఖపట్టణం-చెన్నై ఎగ్మూర్ ప్రత్యేక రైలు(Visakhapatnam-Chennai Egmoor Special Train) ఈ నెల 7,14,21,28, అక్టోబరు 5,12,19,26, నవంబరు 2,9,16,23 (శనివారం) తేదీల్లో విశాఖలో రాత్రి 7 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 8.45 గంటలకు చెన్నై ఎగ్మూర్ చేరుకుంటుంది.
ఇదికూడా చదవండి: హైడ్రా పేరుతో రూ.20 లక్షలు డిమాండ్...
- నెం.08558 చెన్నై ఎగ్మూర్-విశాఖపట్టణం ప్రత్యేక రైలు ఈనెల 8,15,22,29, అక్టోబరు 6,13,20,27, నవంబరు 3,10,17,24, డిసెంబరు 1 (ఆదివారం) తేదీల్లో చెన్నై ఎగ్మూర్‌లో ఉదయం 10.30 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 10.35 గంటలకు విశాఖపట్టణం చేరుకుంటుంది.
- నెం.08539 విశాఖపట్టణం-కొల్లం ప్రత్యేక రైలు(Visakhapatnam-Kollam Special Train) ఈ నెల 11,18,25, అక్టోబరు 2,9,16,23,30, నవంబరు 6,13,20,27 (బుధవారం) తేదీల్లో విశాఖపట్నం నుంచి ఉదయం 8.20 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లం చేరుకుంటుంది.
- నెం.08540 కొల్లం-విశాఖపట్టణం ప్రత్యేక రైలు ఈ నెల 12,19,26, అక్టోబరు 3,10,17,24,31, నవంబరు 7,14,21,28 (గురువారం) తేదీల్లో కొల్లంలో సాయంత్రం 6.35 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 11.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. కొల్లం-విశాఖపట్టణం-కొల్లం పత్యేక రైళ్లు గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట మీదుగా వెళ్లనున్నాయి.
..............................................................................
ఈ వార్తను కూడా చదవండి:
..............................................................................
Governor: త్వరలో తమిళం మాట్లాడతా...
- రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి
చెన్నై: తన ఎదుట ఎవరైనా తమిళంలో మాట్లాడితే సులువుగా అర్థమవుతోందని, త్వరలో ఆ భాష నేర్చుకుని సునాయాసంగా మాట్లాడుతానని గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) పేర్కొన్నారు. తమిళనాడు హిందీ సాహిత్య అకాడమీ, డీజీ వైష్ణవ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళం అత్యంత ప్రాచీనమైన భాష అని, తమిళ ప్రజల్లాగే తాను ఆ భాషను సునాయాసంగా మాట్లాడాలని ఆశపడుతున్నానని, ఏదో ఒక రోజు తమిళంలో మాట్లాడతాననే నమ్మకం తనకుందన్నారు.
తమిళభాషను ప్రపంచ దేశాలకు వ్యాపింపజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలలోనూ తమిళం పాఠ్యాంశంగా చేర్చాలని, ఈ విషయమై గౌహతి విశ్వవిద్యాలయ నిర్వాహకులతో చర్చలు జరుపుతున్నానని చెప్పారు. గత మూడేళ్లుగా తాను తమిళ భాష నేర్చుకుంటున్నానని, ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నానని సభికుల హర్షధ్వానాల మధ్య గవర్నర్ ప్రకటించారు. తమిళ వార్తా పత్రికలను కష్టపడి చదువుతున్నానని చెప్పారు. ఇక భారత దేశం ప్రస్తుతం ప్రగతి పథంలో పయనిస్తోందని, పదేళ్ల క్రితం మన దేశం గురించి ఏ దేశమూ పెద్దగా పట్టించుకోలేదని, ప్రస్తుతం అగ్రరాజ్యాలన్నీ మనవైపే చూస్తున్నాయన్నారు.
ప్రధాని మోదీ(Prime Minister Modi) ప్రధాని అయ్యాక దేశమంతటా స్టార్ట్ అప్ కంపెనీల సంఖ్య విపరీతంగా పెరిగిందని తెలిపారు. వృక్షాలను, జంతువులను మొక్కుతుంటామని, వసుధైక కుటుంబాన్నే కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. విద్యార్థులు దేశాన్ని అభివృద్ధిపరిచే దిశగా కోర్సులను ఎంపిక చేసుకుని చదివితే ఉత్తమ పౌరులుగా రాణించగలుగుతారన్నారు. ఈ సదస్సులో తమిళనాడు హిందీ సాహిత్య అకాడమీ కార్యదర్శి జవహర్ కారూన్, మాజీ వైస్ ఛాన్సలర్ నిర్మలా మౌర్య, వైష్ణవ కళాశాల ప్రిన్సిపాల్ సంతోష్ బాబు, కార్యదర్శి అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News
Updated Date - Sep 04 , 2024 | 12:49 PM