Special trains: ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..
ABN, Publish Date - Apr 09 , 2024 | 11:05 AM
సికింద్రాబాద్ - రామనాథపురం - సికింద్రాబాద్(Secunderabad - Ramanathapuram - Secunderabad) ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే తెలిపింది.
చెన్నై: సికింద్రాబాద్ - రామనాథపురం - సికింద్రాబాద్(Secunderabad - Ramanathapuram - Secunderabad) ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే తెలిపింది. నెం.07695 సికింద్రాబాద్ - రామనాథపురం స్పెషల్ ఈ నెల 10, 17, 24 (గురువారం) తేదీల్లో సికింద్రాబాద్‌లో రాత్రి 9.10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు రాత్రి 11.45 గంటలకు రామనాథపురం చేరుకుంటుంది. నెం.07696 రామనాఽథపురం - సికింద్రాబాద్ స్పెషల్ ఈ నెల 12, 19, 26 (శుక్రవారం) తేదీల్లో రామనాథపురంలో ఉదయం 9.50 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
న్యూ గుంటూరు వెళ్లని జనశతాబ్ది, అండమాన్, లక్నో రైళ్లు...
ఆంధ్ర రాష్ట్రం గుంటూరు - నిడుబ్రోలు(Guntur - Nidubrolu) మధ్య చేపట్టనున్న మరమ్మతుల కారణంగా నెం.12077 చెన్నై సెంట్రల్‌లో ఉదయం 7.25 గంటలకు విజయవాడ బయల్దేరే జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఈనెల 10 నుంచి 30వ తేది వరకు న్యూ గుంటూరు మార్గానికి బదులుగా తెనాలి, దుగ్గిరాల, కృష్ణా కెనాల్ మీదుగా వెళ్లనుంది. అలాగే, నెం.16031 చెన్నై సెంట్రల్- శ్రీ వైష్ణో దేవి కత్రా (అండమాన్ ఎక్స్‌ప్రెస్) రైలు ఈ నెల 10 నుంచి 28వ తేది, నెం.16093 చెన్నై సెంట్రల్ - లక్నో ఎక్స్‌ప్రెస్ ఈ నెల 13 నుంచి 30వ తేది వరకు న్యూ గుంటూరు మార్గానికి బదులుగా తెనాలి, దుగ్గిరాల, కృష్ణా కెనాల్ మీదుగా వెళ్తాయని దక్షిణ రైల్వే తెలిపింది.
ఇదికూడా చదవడి: BJP state president: జైలు నుంచే సెంథిల్ బాలాజి డైరెక్షన్ చేస్తున్నారు...
Updated Date - Apr 09 , 2024 | 11:05 AM