ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections: కాంగ్రెస్ రెండుగా చీలిపోతుంది.. ఆచార్య ప్రమోద్ కృష్ణం జోస్యం

ABN, Publish Date - May 04 , 2024 | 06:47 PM

లోక్‌సభ ఎన్నికల్లోలో రాయబరేలి నియోజకవర్గాన్ని రాహుల్ గాంధీ ఎన్నుకోవడంపై ఆ పార్టీ బహిష్కృత నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోని రాహుల్ గాంధీ వర్గం, ప్రియాంక వర్గంగా కాంగ్రెస్ పార్టీ చీలిపోనుందని జోస్యం చెప్పారు. పార్టీలో జరుగుతున్న 'కుట్రలో బాధితురాలు ప్రియాంక అని వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections)లో రాయబరేలి నియోజకవర్గాన్ని రాహుల్ గాంధీ ఎన్నుకోవడంపై ఆ పార్టీ బహిష్కృత నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం (Acharya Parmod Krishnam) సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోని రాహుల్ గాంధీ వర్గం, ప్రియాంక వర్గంగా కాంగ్రెస్ పార్టీ చీలిపోనుందని జోస్యం చెప్పారు. పార్టీలో జరుగుతున్న 'కుట్రలో బాధితురాలు ప్రియాంక అని వ్యాఖ్యానించారు.

Lok Sabha Elections 2024: మా అన్న యువరాజైతే ఆయన చక్రవర్తి.. మోదికి ప్రియాంక కౌంటర్


జూన్ 4 తర్వాత అగ్నిపర్వతం బద్ధలవుతుంది

అమేథీ నియోజకవర్గా్న్ని రాహుల్ గాంధీ విడిచిపెట్టిన తీరుతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నైతకస్థైర్యం దిగజారిందని ప్రమోద్ కృష్ణం అన్నారు. ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఆమె మద్దతుదారుల్లో ఒక అగ్నిపర్వతంగా రూపుదాల్చి జూన్ 4వ తేదీ తర్వాత బద్ధలవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి రెండుగా చీలిపోతుందని, ఒకటి రాహుల్ గాంధీ వర్గం, మరొకటి ప్రియాంక గాంధీ వర్గమని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో ఆయన (రాహుల్) పాపులారిటీ పెరుగుతున్నందున రాయబేరేలికి బదులుగా రావల్పిండి నియోజకవర్గాన్ని ఎన్నుకుని ఉండాల్సిందని ఆయన చురకలు వేశారు. ప్రియాంక గాంధీని ఎన్నికల్లో రాహల్ పోటీ చేయనీయడని తాను ఎప్పుడో చెప్పానని, పార్టీలోనూ, కుటుంబంలోనూ ప్రియాంక గాంధీకి వ్యతిరేకంగా భారీ కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఫ్యామిలీ, పార్టీ కుట్రలో ఆమె బాధితురాలిగా మారారని వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 04 , 2024 | 06:47 PM

Advertising
Advertising