ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

New Delhi: మనీశ్ సిసోడియాతోపాటు అతిషికి రాఖీలు కట్టిన విద్యార్థులు

ABN, Publish Date - Aug 13 , 2024 | 06:51 PM

మంగళవారం న్యూఢిల్లీ, పశ్చిమ వినోద్ నగర్‌‌లోని రాజకీయ సర్వోదయ బాల విద్యాలయాన్ని విద్యాశాఖ మంత్రి అతిషితో కలిసి మనీశ్ సిసోడియా సందర్శించారు. ఈ సందర్బంగా వారికి పాఠశాల విద్యార్థులు రాఖీలు కట్టారు. విద్యార్ధులతో వారిద్దరు కొద్ది సేపు ముచ్చటించారు.

AAP Leader Manish

న్యూఢిల్లీ, ఆగస్ట్13: మద్యం కుంభకోణం కేసులో ఇటీవల బెయిల్‌పై ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియా తీహాడ్ జైలు నుంచి విడుదలయ్యారు. మంగళవారం న్యూఢిల్లీ, పశ్చిమ వినోద్ నగర్‌‌లోని రాజకీయ సర్వోదయ బాల విద్యాలయాన్ని విద్యాశాఖ మంత్రి అతిషితో కలిసి మనీశ్ సిసోడియా సందర్శించారు. ఈ సందర్బంగా వారికి పాఠశాల విద్యార్థులు రాఖీలు కట్టారు. విద్యార్ధులతో వారిద్దరు కొద్ది సేపు ముచ్చటించారు. మరికొద్ది రోజుల్లో రక్షా బంధన్ పండగ నేపథ్యంలో వారిరువురికి విద్యార్ధులు రాఖీలు కట్టారు.

Also Read: Delhi Lt Governor: అతిషి కాదు.. కైలాశ్ గెహ్లాట్‌కు ఛాన్స్

Also Read: New Delhi: ముగిసిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం


ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో గతేడాది మార్చి 15న డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ని తీహాడ్ జైలుకు తరలించింది. అంతలోనే ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. దీంతో ఆయన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. అలా దాదాపు 17 నెలల పాటు ఆయన తీహాడ్ జైల్లోనే ఉన్నారు. తాజాగా అంటే ఆగస్ట్ 9వ తేదీన సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి విడుదలయ్యారు.

Also Read: Kolkata Doctor's Case: సీబీఐ విచారణకు ఆదేశించిన కోల్‌కతా హైకోర్టు


అనంతరం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి.. ఆయన తల్లిదండ్రుల వద్ద మనీశ్ సిసోడియా ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ మరునాడు.. రాజ్‌ఘాట్‌లోని మహాత్మ గాంధీ సమాధిని సందర్శించి.. ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కన్నాట్ ప్లేస్‌లోని ఆంజనేయస్వామి వారి దేవాలయానికి చేరుకుని.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ శ్రేణులతో మనీశ్ సిసోడియా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా బీజేపీ ప్రభుత్వంపై మనీశ్ సిసోడియా తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. నిజాయితీకి ప్రతీక అని ఆయన అభివర్ణించారు. తీహాడ్ జైలు నుంచి త్వరలోనే అరవింద్ కేజ్రీవాల్ విడుదలవుతారని ఈ సందర్భంగా మనీశ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read: Bangladesh violence: మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసు నమోదు


ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత తీహాడ్ జైల్లోనే ఉన్నారు. వారికి బెయిల్ కోసం పలుమార్లు కోర్టులను ఆశ్రయిస్తున్నా.. వారికి మాత్రం బెయిల్ మంజూరు కావడం లేదు. కానీ 17 నెలల పాటు ఇదే జైల్లో ఉన్న మనీశ్ సిిసోడియాకు బెయిల్ రావడంతో... వారిద్దరికి సైతం బెయిల్ పై విడుదలవుతారనే ఓ ప్రచారం సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది.

Also Read: Bangladesh Violence: పలువురు బంగ్లాదేశీయులు అరెస్ట్

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 13 , 2024 | 06:53 PM

Advertising
Advertising
<