Lok Sabha Elections 2024: ఓటర్ టర్న్ అవుట్ అకస్మాత్తుగా పెరగడంపై మమత డౌట్..
ABN, Publish Date - May 01 , 2024 | 05:16 PM
లోక్‌సభ ఎన్నికల తొలి విడత, రెండో విడతల్లో ఓటింగ్ డేటాను సవరిస్తూ ఎన్నికల కమిషన్ తుది జాబితా ప్రకటించడం, ఇందులో ఓటర్ టర్న్ అవుట్ అకస్మాత్తుగా పెరగడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సందేహాలు వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ తాజా గణాకాంల్లో పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.
ఫరక్కా: లోక్‌సభ ఎన్నికల తొలి విడత, రెండో విడతల్లో ఓటింగ్ డేటాను సవరిస్తూ ఎన్నికల కమిషన్ (ECI) తుది జాబితా ప్రకటించడం, ఇందులో ఓటర్ టర్న్ అవుట్ అకస్మాత్తుగా పెరగడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సందేహాలు వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ తాజా గణాకాంల్లో పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. పశ్చిమబెంగాల్‌లోని ఫరక్కాలో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, పలు ఈవీఎంల జాడ తెలియకుండాపోవడంతో ఫలితాలను బీజేపీ తారుమరు చేసే అవకాశాలున్నాయనే సందేహం కలుగుతోందన్నారు.
Lok Sabha Elections 2024: తొలి విడతలో 66.14 శాతం, రెండో విడతలో 66.71.. ఈసీ ఫైనల్ లెక్క
తొలి, రెండో విడత ఫైనల్ టర్న్ అవుట్‌ను ఎన్నికల కమిషన్ మంగళవారంనాడు విడుదల చేసింది. రెండు విడతల్లోనూ ఓటింగ్ శాతం 66 శాతానికి పైగా ఉంది. ఇంతకుముందు పోలింగ్ లెక్కలతో పోలిస్తే ఈసీ తుది జాబితాలో ఓటింగ్ శాతం 3 నుంచి 4 శాతం పెరిగింది. ఈసీ ప్రకటించిన తుది జాబితా ప్రకారం తొలి విడతలో 66.14 శాతం పోలింగ్ నమోదు కాగా, రెండో విడతలో 66.71 శాతం నమోదైంది. రెండు దశలకు సంబంధించి రాష్ట్రాలపరంగా, పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా ఈ జాబితాను ఈసీ విడుదల చేసింది.
Read Latest National News and Telugu News
Updated Date - May 01 , 2024 | 05:18 PM