ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sumalatha: రేణుకాస్వామి హత్యకేసులో.. మౌనం వీడిన సుమలత.. ఆమె ఏమన్నారంటే..

ABN, Publish Date - Jul 05 , 2024 | 01:09 PM

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యకేసులో దాదాపు నెలరోజులు గా మౌనంగానే ఉన్న ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ సుమలత(Film actress, former MP Sumalatha) మౌనం వీడారు. నటుడు దర్శన్‌ను సుమలత పెద్దకొడుకుగా భావించేవారు. హత్యకేసులో దర్శన్‌ ఎ-2 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మేరకు సుమలత ఏవిధంగా స్పందిస్తారనేది కుతూహలంగా ఉండేది.

- ఆ కుటుంబానికి సంతాపం

- దర్శన్‌ అలాంటి వ్యక్తి కాదని కితాబు

- సోషల్‌ మీడియాలో వివరణ

బెంగళూరు: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యకేసులో దాదాపు నెలరోజులు గా మౌనంగానే ఉన్న ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ సుమలత(Film actress, former MP Sumalatha) మౌనం వీడారు. నటుడు దర్శన్‌ను సుమలత పెద్దకొడుకుగా భావించేవారు. హత్యకేసులో దర్శన్‌ ఎ-2 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మేరకు సుమలత ఏవిధంగా స్పందిస్తారనేది కుతూహలంగా ఉండేది. ప్ర ముఖ నటుడు దర్శన్‌ కేసులో ఇరుక్కుపోవడంతో అనుకూల వ్యతిరేక వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు సుమలత సోషల్‌ మీడియా వేదికగా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. 44 ఏళ్లుగా నటిగాను, ప్రజాజీవనంలో ఎన్నోఏళ్లుగా ఉన్నానని, ఐదేళ్లు ఎంపీగా వ్యవహరించానని, అంబరీశ్‌ భార్యగా, అభిషేక్‌కు తల్లిగా ప్రతి బాధ్యతను గంభీరంగానే భావించానని అన్నారు. సమాజంలో అంశం ఏదైనా సమగ్ర సమాచారం లేకుండా మాట్లాడటం సరికాదని భావించానని తెలిపారు.

ఇదికూడా చదవండి: Hero Darshan: హీరో దర్శన్‌ కస్టడీ మరో14 రోజులు పొడిగింపు


ముందుగా కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు, రేణుకాస్వామి(Renukaswamy)ని కోల్పోయిన భార్యకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తాను మౌనంగా ఉండటం వెనుక బాధ ఉందని అన్నారు. దర్శన్‌ స్టార్‌ కాక ముందు 25 ఏళ్ల నుంచి తెలుసు అన్నారు. అంబరీశ్‌ను అప్పాజీగా గౌరవించేవారని, తనను తల్లిగా భావించారని తెలిపారు. ఏ తల్లి కూడా కుమారుడిని ఇటువంటి పరిస్థితిలో చూడటాన్ని సహించరన్నారు. దర్శన్‌కు ఇలాంటి కృత్యాలు చేసే మనస్తత్వం లేదన్నారు. దర్శన్‌ భార్య విజయలక్ష్మితో పాటు కుమారుడి పట్ల సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టింగులు బాధ కలిగించాయన్నారు. ఇప్పటికే భయానక పరిస్థితిని ఎదుర్కొంటున్న వారి పట్ల కామెంట్లు వారి కుటుంబాలపై ఎంతటి ప్రభావం చూపుతాయనేది పరిగణించాలని పేర్కొన్నారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 05 , 2024 | 01:09 PM

Advertising
Advertising