ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఢిల్లీ మద్యం కేసులో ఆఖరి నిందితుడికీ బెయిల్‌

ABN, Publish Date - Oct 26 , 2024 | 02:42 AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో చివరి నిందితుడైన వ్యాపారవేత్త అమన్‌దీ్‌పసింగ్‌ ధాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

  • అమన్‌దీ్‌పకు సుప్రీంకోర్టులో ఊరట

న్యూఢిల్లీ, అక్టోబరు 25: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో చివరి నిందితుడైన వ్యాపారవేత్త అమన్‌దీ్‌పసింగ్‌ ధాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. శుక్రవారం ఆయనకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో ఆప్‌ నేతలు కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోడియా, సంజయ్‌ సింగ్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు ఇప్పటికే బెయిల్‌పై బయటికొచ్చిన సంగతి తెలిసిందే. అమన్‌దీ్‌ప.. ఈ కేసులో గత ఏడాది మార్చిలో అరెస్టయ్యారు. అనంతరం ఆయన బెయిల్‌ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. నిరాశే ఎదురైంది. దీంతో హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఈ ఏడాది జూన్‌లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై తాజాగా జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. అమన్‌దీ్‌పను కస్టడీలో ఉంచడం వల్ల ఏ ప్రయోజనము ఉండదని అభిప్రాయపడ్డ ధర్మాసనం.. ట్రయల్‌ కోర్టు నిబంధనలకు లోబడి బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Oct 26 , 2024 | 02:45 AM