ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తిరుపతి లడ్డూపై సుప్రీం విచారణ నేటికి వాయిదా

ABN, Publish Date - Oct 04 , 2024 | 03:30 AM

తిరుమల శ్రీవేంకటేశ్వరుడ్డి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించిన సిట్‌ దర్యాప్తునే కొనసాగించాలా.. లేక కేంద్రం విచారణ జరిపించాలా అన్న అంశంపై సస్పెన్స్‌ శుక్రవారం వీడనుంది.

న్యూఢిల్లీ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరుడ్డి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించిన సిట్‌ దర్యాప్తునే కొనసాగించాలా.. లేక కేంద్రం విచారణ జరిపించాలా అన్న అంశంపై సస్పెన్స్‌ శుక్రవారం వీడనుంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని శుక్రవారం చెబుతామని, అప్పటివరకు సమయం కావాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా గురువారం సుప్రీంకోర్టును కోరారు. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం ఇందుకు అంగీకరించింది. శుక్రవారం దీనిని తొలి కేసుగా విచారిస్తామని తెలిపింది. వాస్తవానికి గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ కేసు విచారణకు రావలసింది.

దానికి కొద్ది నిమిషాల ముందు తుషార్‌ మెహతా హాజరై ధర్మాసనం అనుమతిస్తే శుక్రవారం ఉదయం కచ్చితంగా 10.30 గంటలకు తన స్పందన తెలియజేస్తానని అన్నారు. రాష్ట్రం వేసిన సిట్‌ను మరికొందరు అధికారులతో విస్తరించాలా.. లేక సీబీఐ తరహాలో కేంద్ర ప్రభుత్వంతో దర్యాప్తు జరిపించాలా అన్న అంశంపై మెహతా తన అభిప్రాయం వెల్లడించనున్నారు. సుప్రీంకోర్టు ఏ రకమైన దర్యాప్తునకు ఆదేశించినా తమకు అభ్యంతరం లేదనే ఆయన చెప్పే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో తలమునకలై ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను గురువారం రాత్రి సంప్రదించిన తర్వాత మెహతా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిర్ధారిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Updated Date - Oct 04 , 2024 | 03:30 AM