ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court : నిందితుడు సీఎం అయితే.. న్యాయస్థానాలు ప్రభావితమవుతాయా!?

ABN, Publish Date - Jul 23 , 2024 | 05:59 AM

ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి ఎందుకు మార్చాలని సుప్రీం కోర్టు నిలదీసింది. నిందితుడు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కోర్టులు ప్రభావితం అవుతాయా? అంటూ అసహనం వ్యక్తం చేసింది.

  • కేసును వేరే రాష్ట్రానికి ఎందుకు బదిలీ చేయాలి!?

  • ఉన్నత స్థానాల్లోని వ్యక్తులపై కేసులు

  • నమోదైతే పాక్‌, శ్రీలంకకు మార్చాలా?

  • ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు

  • ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

  • కేసును వేరే రాష్ట్రానికి ఎందుకు బదిలీ చేయాలి!?

  • ఓటుకు నోటు కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి ఎందుకు మార్చాలని సుప్రీం కోర్టు నిలదీసింది. నిందితుడు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కోర్టులు ప్రభావితం అవుతాయా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలంటూ ఈ ఏడాది జనవరి 31న మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మాజీ మంత్రులు జగదీశ్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, శాసన సభ్యుడు కల్వకుంట్ల సంజయ్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. తొలుత పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. విచారణకు ముందు రోజు (ఆదివారం) రాత్రే కౌంటర్‌ దాఖలు చేశారని, దానికి జవాబు (రీజాయిండర్‌) ఇచ్చేందుకు రెండు వారాల సమయం కావాలని కోరారు.

ఈ కేసులో నిందితుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి అని, ఆధారాలు తారుమారు చేయవచ్చని, సాక్షులను ప్రభావితం చేయవచ్చని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు తమ వాదనలను మార్చుకునే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘‘నిందితుడు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కోర్టులు ప్రభావితం అవుతాయా? కేసును మరో రాష్ట్రానికి మార్చాలా? దేశంలో ఉన్నత స్థానాల్లోని వ్యక్తులపై కేసులు నమోదైతే పాకిస్థాన్‌, శ్రీలంకకు మార్చాలా?’’ అని ప్రశ్నించింది. రెండు వారాల్లో కౌంటర్‌కు జవాబు ఇవ్వాలని పిటిషనర్లకు నిర్దేశించింది.

Updated Date - Jul 23 , 2024 | 06:00 AM

Advertising
Advertising
<