Supreme Court: సుప్రీంకోర్టు ఆదేశం.. స్కూళ్లు మళ్లీ ఫిజికల్‌గా ప్రారంభం
ABN, Publish Date - Dec 06 , 2024 | 07:25 AM
ఢిల్లీలో కాలుష్యం తగ్గిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంక్షలను తగ్గించేందుకు అనుమతి ఇస్తూనే, తదుపరి పర్యవేక్షణ అవసరమని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో స్కూళ్లు ఫిజికల్ విధానంలో మళ్లీ ప్రారంభించాలని తెలిపింది.
ఢిల్లీ (Delhi) ప్రజలకు మరో రిలీఫ్ న్యూస్. ప్రస్తుతం ఢిల్లీలో కాలుష్యం తగ్గుముఖం పట్టింది. దీంతో GRAP-4 నిబంధనలు తొలగించాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది. ఈ క్రమంలో నేటి నుంచి పాఠశాలల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలలు ఫిజికల్ మోడ్‌లో నడుస్తాయని, విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలని ఢిల్లీ ప్రభుత్వ విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు (డిసెంబరు 6) నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి రానున్నాయి.
అనేక పరిమితులు
ఢిల్లీలో కాలుష్యం కారణంగా GRAP-4 నిబంధనలు గతంలో అమలు చేశారు. దీని ప్రకారం ఆన్‌లైన్ మోడ్‌లో పాఠశాలలను నిర్వహించడం సహా అనేక పరిమితులు విధించారు. ఇప్పుడు AQI స్థాయి మెరుగుపడిన తర్వాత, GRAP-4 రూల్స్ కొన్ని తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీని తర్వాత ఇప్పుడు పాఠశాలలు మళ్లీ యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆన్‌లైన్ చదువుల విధానాన్ని రద్దు చేసినట్లు విద్యాశాఖ ప్రకటించింది.
తక్కువగా ఉండడంతో
AQI స్థాయి 350 దాటితే GRAP-3 కింద కొన్ని పరిమితులు విధించబడతాయని, AQI 400 దాటితే GRAP-4 కింద కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రస్తుతం ఢిల్లీలో ఏక్యూఐ లెవల్ 300 కంటే తక్కువగా ఉండడంతో పాఠశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయించారు. గురువారం ఢిల్లీలో ఏక్యూఐ 165 నమోదైంది. AQI తక్కువ నుంచి మోడరేట్ కేటగిరీకి పడిపోయినప్పుడు, సుప్రీంకోర్ట్ కూడా GRAP-4 పరిమితులను ఎత్తివేయడానికి అంగీకరించింది. ఈ క్రమంలో GRAP-4ని తొలగించి GRAP పరిమితులను అమలు చేయాలని సెంటర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) గురువారం రాత్రి ప్రకటించింది.
ఈ ఆంక్షలు మాత్రం..
పరిమితుల సడలింపు తర్వాత శుక్రవారం నుంచి ఢిల్లీ పాఠశాలల్లో ఫిజికల్ క్లాసులు ప్రారంభమవుతాయని విద్యా శాఖ డైరెక్టరేట్ తెలిపింది. 12వ తరగతి వరకు అన్ని పాఠశాలల్లోని పిల్లలందరికీ ఆన్‌లైన్ తరగతులు ఇకపై నిర్వహించబడవని స్పష్టం చేశారు. గ్రూప్ 2 ఆంక్షల కింద ఢిల్లీలో పాత వాహనాలపై నిషేధం కొనసాగుతుంది. బొగ్గు, కలపను కాల్చడం వంటి ఆంక్షలు కూడా అలాగే ఉంటాయి. ప్రైవేట్ వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను ఉపయోగించాలని కూడా సూచించింది.
అయితే చలి పెరగడం, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీలో ఏటా కాలుష్యం పెరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది కూడా అదే తీరు కనిపిస్తోంది. స్కైమేట్, ప్రైవేట్ వాతావరణ అంచనా ఏజెన్సీ ప్రకారం ఢిల్లీ, ఉత్తర భారతదేశంలో గాలి వేగం పెరగడం వల్ల ఢిల్లీ-NCR లో కాలుష్య స్థాయిలు తగ్గాయి. అయితే రానున్న రోజుల్లో కాలుష్యం మరింత పెరగవచ్చు.
ఇవి కూడా చదవండి:
Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Bitcoin: మొదటిసారి లక్ష డాలర్లు దాటిన బిట్‌కాయిన్.. కారణమిదేనా..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Recharge Plans: 5 నెలల చౌక ప్లాన్ ప్రకటించిన BSNL.. మిగతా వాటితో పోలిస్తే ధర..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Dec 06 , 2024 | 07:28 AM