ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court : నితీశ్‌ సర్కారుకు సుప్రీంలోనూ నిరాశే

ABN, Publish Date - Jul 30 , 2024 | 01:49 AM

బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు తీర్పును నిలిపివేయడానికి చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ ధర్మాసనం నిరాకరించింది.

  • గతంలో రిజర్వేషన్లు 65 శాతానికి పెంపు చెల్లదన్న పట్నా హైకోర్టు

  • ఆ ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరణ

న్యూఢిల్లీ, జూలై 29: బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు తీర్పును నిలిపివేయడానికి చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ ధర్మాసనం నిరాకరించింది. నితీశ్‌ సర్కారు బిహార్‌లో దళితులు, ఆదివాసీలు, బీసీల కోటాను 50% నుంచి 65 శాతానికి పెంచుతూ రిజర్వేషన్‌ చట్టానికి సవరణ తెచ్చింది.

దాన్ని పాట్నా హైకోర్టు తిరస్కరించడంతో నితీశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సోమవారం చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

పాట్నా హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి తిరస్కరించిన సుప్రీంకోర్టు, ఈ విషయంలో బిహార్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను మాత్రం విచారణకు స్వీకరించింది. వీటిపై సెప్టెంబరులో విచారణ చేపడతామని తెలిపింది. బిహార్‌ ప్రభుత్వం తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ శ్యామ్‌ దివాన్‌ వాదనలు వినిపించారు.

ఛత్తీ్‌సగఢ్‌లో రిజర్వేషన్‌ పెంపును వ్యతిరేకించిన అక్కడి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసిన విషయం ఆయన గుర్తుచేశారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ పిటిషన్‌ను విచారణకు తీసుకుంటాం కానీ హైకోర్టు తీర్పును నిలుపుదల చేయలేం అని తేల్చిచెప్పింది.

Updated Date - Jul 30 , 2024 | 01:49 AM

Advertising
Advertising
<