ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gyanvapi: అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ABN, Publish Date - Apr 01 , 2024 | 05:02 PM

జ్ఞానవాపి (Gyanvapi) మసీదు లోపల హిందువులు పూజ చేయడాన్ని అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టులో (Supreme Court) సవాల్ చేసింది. మసీదులో గల వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజ చేసుకోవడానికి వారణాసి కోర్టు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. దానిని అంజుమన్ కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. అక్కడ చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఢిల్లీ: జ్ఞానవాపి (Gyanvapi) మసీదు లోపల హిందువులు పూజ చేయడాన్ని అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టులో (Supreme Court) సవాల్ చేసింది. మసీదులో గల వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజ చేసుకోవడానికి వారణాసి కోర్టు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. దానిని అంజుమన్ కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. అక్కడ చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ను సోమవారం నాడు (ఏప్రిల్ 1వ తేదీన) సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. మసీదులో హిందువులు పూజ చేసుకోవడంపై స్టే విధించేందుకు జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది.

పూజలు చేసుకోవచ్చు

జ్ఞానవాపి మసీదులో ముస్లింలు, హిందువులు ఎప్పటి మాదిరిగా పూజ చేసుకోవాలని స్టేటస్ కో (యథాతథ స్థితి) విధించింది. జ్ఞానవాపి మసీదులో ముస్లింలు ప్రార్థనలు చేసేందుకు ఉత్తరం వైపు నుంచి రావాలని, హిందువులు పూజలు నిర్వహించేందుకు దక్షిణం నుంచి రావాలని సూచించింది. అంజుమన్ కమిటీ తరఫున హుజెఫా అహ్మది, హిందు సంస్థల తరఫున శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను జూలై నెలకు వాయిదా వేసింది.

ఏం జరిగిందంటే..?

జ్ఞానవాపి మసీదు లోపల ఉన్న వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజ చేసేందుకు వారణాసి సెషన్స్ జడ్జి అనుమతిచ్చారు. దానిని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ తప్పుపట్టింది. అలహాబాద్ హైకోర్టులో (Allahabad High Court) సవాల్ చేసింది. పిటిషన్‌పై ఇరు వర్గాల మధ్య వాదనలు జరిగాయి. అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ రోహిత్ రంజన్ వారణాసి కోర్టు తీర్పుతో ఏకీభవించారు. దాంతో అంజుమన్ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జ్ఞానవాపి మసీదులో వివాదం నెలకొనడంతో 1993 నుంచి హిందువులు పూజ చేయడం లేదు. వారణాసి కోర్టు తీర్పుతో పూజలు చేయడం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు చేశారు. జ్ఞానవాపి మసీదు లోపల ఉన్న ‘వ్యాస్ కా టెఖానా’లో మసీదు సీలు చేసిన నేలమాళిగలో హిందువులు పూజలు నిర్వచేస్తోన్న సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

Katchatheevu islands row: కొందరు వేగంగా రంగులు మారుస్తుంటారు.. జైశంకర్‌పై చిదంబరం వ్యంగ్యోక్తులు

Election Commission: దిలీప్ ఘోష్, సుప్రియ శ్రీనేత్‌కు ఈసీ సీరియస్ వార్నింగ్

Updated Date - Apr 01 , 2024 | 05:02 PM

Advertising
Advertising