ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court : మృత్యు కుహరాలుగా కోచింగ్‌ సెంటర్లు

ABN, Publish Date - Aug 06 , 2024 | 05:19 AM

కోచింగ్‌ సెంటర్లు మృత్యు కుహరాలుగా మారాయని సోమవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అవి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని విమర్శించింది.

న్యూఢిల్లీ, ఆగస్టు 5: కోచింగ్‌ సెంటర్లు మృత్యు కుహరాలుగా మారాయని సోమవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అవి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని విమర్శించింది. పాత రాజీందర్‌నగర్‌లోని రావ్స్‌ ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌లోని బేస్‌మెంట్‌లో వరదల కారణంగా ముగ్గురు విద్యార్థులు మరణించిన ఘటనపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది.

విచారణ జరిపిన జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ల ధర్మాసనం కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. కోచింగ్‌ సెంటర్లలో భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ఆదేశించింది.

ఈ దుర్ఘటన అందరికీ కనువిప్పు కావాలని ఆకాంక్షించింది. మరోవైపు అన్ని కోచింగ్‌ సెంటర్లను తనిఖీ చేయాలంటూ 2023లో ఢిల్లీ హైకోర్టు అగ్నిమాపక శాఖను ఆదేశించడాన్ని సవాలు చేస్తూ కోచింగ్‌ సెంటర్ల అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ధర్మాసనం పరిశీలించింది. ఇది పసలేని పిటిషన్‌ అని పేర్కొంటూ రూ.లక్ష జరిమానా విధించింది.

Updated Date - Aug 06 , 2024 | 05:19 AM

Advertising
Advertising
<