ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌

ABN, Publish Date - Sep 01 , 2024 | 04:52 AM

ఎస్సీ వర్గీకరణపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలయింది.

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలయింది. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య శనివారం దీన్ని దాఖలు చేశారు. తమ పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుందని ఆయన మీడియాకు వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 341కి వ్యతిరేకమని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై పార్లమెంట్‌లో చట్టం చేయాల్సి ఉంటుందని, ఈ విషయంలో సుప్రీంకోర్టుకు అధికారం లేదన్నారు.

Updated Date - Sep 01 , 2024 | 04:52 AM

Advertising
Advertising