ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bulldozer Justice: బుల్డోజర్ న్యాయంపై సుప్రీం కోర్టు సీరియస్.. ఏమన్నదంటే..

ABN, Publish Date - Nov 13 , 2024 | 12:47 PM

Bulldozer Justice: రూల్స్‌కు విరుద్ధంగా ఒక్క ఇల్లును కూల్చివేసినా అది రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్న సుప్రీం కోర్టు.. బుల్డోజర్‌ న్యాయం మీద బుధవారం తీర్పు వెలువరించింది. ఇలాంటి సందర్భాల్లో వ్యవహరించాల్సిన విషయమై దేశం మొత్తానికి వర్తించే విధంగా సంచలన తీర్పు ఇచ్చింది.

న్యూఢిల్లీ: రూల్స్‌కు విరుద్ధంగా ఒక్క ఇల్లును కూల్చివేసినా అది రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్న సుప్రీం కోర్టు.. బుల్డోజర్‌ న్యాయం మీద బుధవారం తీర్పు వెలువరించింది. ఇలాంటి సందర్భాల్లో వ్యవహరించాల్సిన విషయమై దేశం మొత్తానికి వర్తించే విధంగా సంచలన తీర్పు ఇచ్చింది. నేరాలకు పాల్పడిన వారిపై బుల్డోజర్ చర్యలు చేపట్టడం మీద సుప్రీం సీరియస్ అయింది. బుల్డోజర్ చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల మీద జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ తీర్పును ఇచ్చింది. ఇళ్లను కూల్చడం సరికాదని.. ఇది నివసించే హక్కును కాలరాసినట్లు అవుతుందని అభిప్రాయపడింది. నిష్పాక్షిక విచారణ పూర్తి కాకుండానే నిందితుడిని దోషిగా పరిగణించలేం పేర్కొంది. అలాంటి వ్యక్తుల ఇళ్లను కూల్చడం అధికార దుర్వినియోగం, చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది.


మా పని మీరే చేస్తారా?

ఒకవేళ దోషిగా నిర్థారించినా చట్ట ప్రకారం శిక్ష ఉంటుంది తప్ప బుల్డోజర్‌తో న్యాయం చేయలేమని సుప్రీం కోర్టు చెప్పుకొచ్చింది. చట్టాన్ని, నిబంధనలను అతిక్రమించి నిందితుడు లేదా దోషి ఇంటిని కూల్చేస్తే.. ఆ కుటుంబసభ్యులకు పరిహారం చెల్లించాల్సిందేనని సర్వోన్నత ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది. న్యాయవ్యవస్థ స్థానాన్ని పాలనావ్యవస్థ ఎప్పటికీ భర్తీ చేయలేదని సుప్రీం వ్యాఖ్యానించింది. కోర్టుల పాత్రను అధికారులు పోషించడం సరికాదని ఫైర్ అయింది. దోషులను నిర్ధారించడం కోర్టుల పని అని.. కార్యనిర్వాహక అధికారులది కాదని స్పష్టం చేసింది.


యావత్ దేశానికి..

నోటీసులు ఇవ్వకుండా కూల్చడం ఏంటని సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ఇక మీదట ఇలాంటివి కుదరదని తేల్చి చెప్పింది. కూల్చివేతలకు మతానికి లింక్ పెట్టడం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించింది. ఇది ఏ ఒక్క రాష్ట్రానికో కాదని.. ఈ ఆదేశాలు మొత్తం దేశానికి సంబంధించినవి అని కోర్టు పేర్కొంది. క్రిమినల్ కేసులో నిందితుడు అనే రీజన్‌తో ఎవరి ఇంటినైనా కూల్చేస్తామంటే కుదరదని.. అలాంటి పరిస్థితుల్లో అధికారులు చట్టాన్ని విస్మరించరాదని స్పష్టం చేసింది. ప్రతి ఫ్యామిలీకి ఇల్లు ఉండాలనేది ఒక డ్రీమ్ అని తెలిపింది.


Also Read:

నటి కస్తూరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు

ఆ వినాశనం మీకే తెలుసు ఖర్గే!

కాంట్రాక్టు పనుల్లో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్‌

For More National And Telugu News

Updated Date - Nov 13 , 2024 | 12:54 PM