Sashi Tharoor: మోదీ శివలింగంపై తేలు.. శశిథరూర్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్టే
ABN, Publish Date - Sep 10 , 2024 | 02:46 PM
శశిథరూర్ తరఫు న్యాయవాది మొహమ్మది అలీ ఖాన్ కోర్టులో తన వాదన వినిపించారు. పరువునష్టం కేసు వేసిన బీజేపీ నేత రాజీవ్ బబ్బర్ తొలుత ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కానీ, వాటిని పబ్లిష్ చేసిన మ్యాగజైన్‌ను కానీ కేసులో చేర్చడంలో విఫలమయ్యారని అన్నారు.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని 'శివలింగంపై తేలు' (Scropin sitting on a Shivling) అంటూ 2018లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో ప్రొసీడింగ్స్‌పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor)కు ఒకింత ఊరట లభించింది. ఈ కేసు ప్రొసీడింగ్స్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారంనడు తాత్కాలిక స్టే ఇచ్చింది. పరువునష్టం కేసు కొట్టివేయాలంటూ థరూర్ చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 29న తోసిపుచ్చింది. దీంతో సుప్రీంకోర్టును థరూర్ ఆశ్రయించారు. న్యాయమూర్తులు హృషీకేశ్ రాయ్, ఆర్.మాధవన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం తాజాగా కేసు విచారణ జరిపింది.
శశిథరూర్ తరఫు న్యాయవాది మొహమ్మది అలీ ఖాన్ కోర్టులో తన వాదన వినిపించారు. పరువునష్టం కేసు వేసిన బీజేపీ నేత రాజీవ్ బబ్బర్ తొలుత ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కానీ, వాటిని పబ్లిష్ చేసిన మ్యాగజైన్‌ను కానీ కేసులో చేర్చడంలో విఫలమయ్యారని అన్నారు. దీంతో క్రిమినల్ డిఫమేషన్ కేసు ప్రొసీడింగ్స్‌పై కోర్టు తాత్కాలిక స్టే విధిస్తూ, నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని బబ్బర్‌కు నోటీసు జారీ చేసింది.
దీనికి ముందు, థరూర్‌పై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొట్టివేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ప్రధానమంత్రిపై 'శివలింగంపై తేలు' అని వ్యాఖ్యానించడం విచారకరమని, ప్రాథమిక ఆధారాల ప్రకారం ఆయన వ్యాఖ్యలు ప్రధానిని, బీజేపీని, ఆ పార్టీ ఆఫీసు బేరర్లు, సభ్యులను కించపరచేలా ఉన్నాయన పేర్కొంది
శశిథరూర్ ఏమన్నారు..
మోదీ శివలింగపై కూర్చున్న తేలువంటివారని ఆర్ఎస్ఎస్‌కు చెందిన ఒక జర్నలిస్టు తనతో చెప్పినట్టు శశిథరూర్ గతంలో వ్యాఖ్యానించారు. మీరు వాటిని మీ చేతితో తీసివేయలేరు, చెప్పులతో కొట్టలేరు...అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై రాజీవ్ బబ్బర్ పరువనష్టం కేసు వేశారు. శశిథరూర్ వ్యాఖ్యలు శివభక్తులందరి మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 499 (పరువు నష్టం), 500 (పరువునష్టానికి శిక్ష) కింద ఫిర్యాదు దాఖలైంది.
Read More National News and Latest Telugu News Click Here
Rahul Gandhi: యూఎస్ పర్యటనలో మళ్లీ కీలక వ్యాఖ్యలు
Updated Date - Sep 10 , 2024 | 02:51 PM