Share News

Taj Mahal: బ్యాడ్ న్యూస్.. తాజ్‌మహల్‌ను ఇక అలా చూడలేమేమో..

ABN , Publish Date - Nov 05 , 2024 | 11:25 AM

Taj Mahal Sunset: ఆగ్రామాలోని మహతాబ్ బాగ్ సమీపంలోని పదకొండు మెట్ల పార్క్ నుంచి సాయంత్రం కనిపించే అందమైన సూర్యాస్తమయ దృశ్యాన్ని ప్రజలు ఇప్పుడు చూడలేరు. ఇందుకు కారణం.. ఇంతకాలం వివాదంలో ఉన్న ఆ భూమిని యజమానికి సొంతం చేసుకోవడమే. సుదీర్ఘ న్యాయ పోరాటం తరువాత ఓ రైతు..

Taj Mahal: బ్యాడ్ న్యూస్.. తాజ్‌మహల్‌ను ఇక అలా చూడలేమేమో..
Taj Mahal

Taj Mahal Sunset: ఆగ్రామాలోని మహతాబ్ బాగ్ సమీపంలోని పదకొండు మెట్ల పార్క్ నుంచి సాయంత్రం కనిపించే అందమైన సూర్యాస్తమయ దృశ్యాన్ని ప్రజలు ఇప్పుడు చూడలేరు. ఇందుకు కారణం.. ఇంతకాలం వివాదంలో ఉన్న ఆ భూమిని యజమానికి సొంతం చేసుకోవడమే. సుదీర్ఘ న్యాయ పోరాటం తరువాత ఓ రైతు.. ఈ భూమిని దక్కించుకున్నాడు. దీంతో ఈ స్థలంలోకి సాధారణ ప్రజలు ప్రవేశించే పరిస్థితి లేదు. అంతేకాదు.. సదరు రైతు తన భూమిని ట్రాక్టర్‌తో దున్నేశాడు. పార్క్ గేటు వద్ద బారీకేడ్స్ ఏర్పాటు చేశాడు. భూమిలోకి ఎంటరయ్యే ప్రదేశంలో రైతు పేరు పెట్టి.. లోపలికి రావడం నిషేధం అనే బోర్డు కూడా ఏర్పాటు చేశారు. కాగా, ఈ భూమి ఆగ్రా డెవలప్‌మెంట్ అథారిటీ(ఏడీఏ) పరిధిలోకి వస్తుందని ఆగ్రా డివిజనల్ కమిషనర్ రీతూ మహేశ్వరి తెలిపారు. ఇటీవలి పరిణామాలపై విచారణ జరుపుతున్నామని ఆమె చెప్పారు.


ఈ భూమి ఎవరిది.. అసలు ఈ వివాదం ఏందీ..

స్థానిక రైతు మున్నా లాల్.. కోర్పు తీర్పు ఆధారంగా పార్క్‌లో కొంత భాగాన్ని తన సొంతం చేసుకున్నాడు. కచ్‌పురాలోని నాగ్లా దేవ్‌జిత్‌కు చెందిన రైతు మున్నా లాల్ మాట్లాడుతూ.. పార్క్‌లోని 6 బిగాల స్థలం తన పూర్వీకులదని చెప్పాడు. ఈ భూమి కోసం తాను నాలుగు దశాబ్దాలు న్యాయస్థానంలో పోరాటం చేశానన్నారు. ఎట్టకేలకు ఈ కేసులో తాను గెలిచానన్నాడు. ఇంకేముంది.. తన స్థలం చుట్టూ కంచె వేసి భూమిని ట్రాక్టర్‌తో దున్నేశాడు. స్థలం చుట్టూ కంచెలు, బారికేడ్‌లను నిర్మించాడు. ప్రజలు రాకుండా నిషేధించాడు. వాస్తవానికి ఈ భూమి తన తండ్రి, తాతల నుంచి వారసత్వంగా ఉంది. అయితే, 1976లో అర్బన్ సీలింగ్ సమయంలో ఈ భూమిని అధికారులు లాగేసుకున్నట్లు చెప్పాడు. దీనిపై ఇంతకాలం న్యాయపోరాటం కొనసాగించారు.

Taj-Mahal-Park.jpg


40 ఏళ్ల సుదీర్ఘ పోరాటం..

1998 నుంచి 2020 వరకు జిల్లా కోర్టు డాక్యూమెంట్స్ అన్నీ మున్నా లాల్‌కే ఆ భూమిపై హక్కు ఉందని నిర్ధారించాయి. ఇదే విషయమై మీడియాతో మాట్లాడిన మున్నాలాల్.. ఈ భూమిని స్వాధీనం చేసుకోవడానికి నా కుటుంబం 40 ఏళ్లుగా న్యాయ పోరాటం చేసింది. మా వద్ద కోర్టు ఆదేశాలు, చట్టపరమైన పత్రాలు ఉన్నాయి. 2020లో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కార్యాలయం సైతం ఈ భూమిపై తమ యాజమాన్య హక్కులను క్లెయిమ్ చేయడం జరిగిందన్నారు. రెవెన్యూ రికార్డుల్లోనూ ఈ విషయం నమోదైందన్నారు. చివరకు వీటన్నింటినీ పరిశీలించిన కోర్టు.. భూమి తమదేనని నిర్ధారించినట్లు మున్నాలాల్ చెప్పారు.


అయితే, ఇంతకాలం ఈ భూమి ఆగ్రా డెవలప్‌మెంట్ అథారిటీ నిర్వహణలో ఉంది. చారిత్రాత్మకమైన మెహతాబ్‌ బాగ్‌కు ఆనుకొని ఉన్న ఈ పార్క్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర ఆకర్షణీయమైన కార్యక్రమాలు నిర్వహించేవారు. అంతేకాదు.. ఈ ప్రాంతంలో సందర్శకులను ఆకట్టుకునేందుకు సాంస్కృతి, వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏడీయే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.


ఈ పార్క్ స్పెషల్ ఏంటంటే..

తాజ్ మహల్ అందాలను వీక్షించేందుకు ఈ పార్క్ చాలా అనువైన ప్రదేశం. ఇక్కడ ఏళ్ల తరబడి సంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతకంటే ముఖ్యంగా ఈ ప్రదేశం నుంచి తాజ్ మహల్ పూర్తి అందాన్ని వీక్షించొచ్చు. సూర్యాస్తమయం సమయంలో ఇక్కడి నుంచి తాజ్‌మహల్‌ను చూస్తే ఆ అనుభూతి వేరే లెవల్‌లో ఉంటుందట. కానీ, ఇప్పుడు కోర్టు తీర్పు ప్రకారం.. ఈ భూమి మున్నాలాల్ స్వాధీనం చేసుకున్నాడు. దీనిపై ఏడీఏ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.


Also Read:

తమిళనాట పరిస్థితి ఏంటి.. విజయ్‌ గెలిచేనా..

అమరావతిపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

షాంపూలో ఇది కలిపి రాస్తే జుట్టు రాలే సమస్య మాయం..

For More National News and Telugu News..

Updated Date - Nov 05 , 2024 | 11:26 AM