MK Stalin Meets Modi: మోదీతో ఎంకే స్టాలిన్ 45 నిమిషాలు భేటీ
ABN, Publish Date - Sep 27 , 2024 | 04:43 PM
ఒక ముఖ్యమంత్రిగా తాను ప్రధానిని కలుసుకున్నానని, ప్రధానిగా ఆయన తమ వినతులను ఆలకించారని ఎంకే స్టాలిన్ చెప్పారు. ప్రధానంగా ప్రధానికి మూడు వినతలు చేసినట్టు చెప్పారు.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని డీఎంకే అధ్యక్షుడు, తమళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) శుక్రవారంనాడు ఢిల్లీలో కలుసుకున్నారు. 'సమగ్ర శిక్షా స్కీమ్' కింద కేంద్ర నిధులు విడుదల చేయాలని, 50:50 ఈక్విటీ షేర్ కింద చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-2కు అనుమతి ఇవ్వాలని ప్రధానిని ఆయన కోరారు. భారత మత్య్సకారులకు సంప్రదాయంగా ఉన్న చేపటవేట హక్కులను పరిరక్షించాలని, సముద్ర జలాల్లో పట్టుకున్న తమిళ మత్స్యకారులు, వారి పడవలను త్వరితగతిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఒక విజ్ఞాపన పత్రాన్ని ప్రధానికి స్టాలిన్ అందజేశారు. సుమారు 45 నిమిషాల పాటు ఉభయులూ భేటీ అయ్యారు.
ప్రధానితో భేటీ అనంతరం మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ, సహజంగా ఇలాంటి సమావేశాలకు 15 నిమిషాలు సమయం ఇస్తారని, అయితే ఈసారి ఉభయులూ 45 నిమిషాల పాటు మాట్లాడుకున్నామని చెప్పారు. ఒక ముఖ్యమంత్రిగా తాను ఆయనను కలుసుకున్నానని, ప్రధానిగా ఆయన తమ వినతులను ఆలకించారని చెప్పారు. ప్రధానంగా ప్రధానికి మూడు వినతలు చేసినట్టు చెప్పారు.
Haryana Assembly Elections: ఎన్నికల వేళ 13 మంది నేతలపై కాంగ్రెస్ బహిష్కరణ వేటు
చెన్నై మెట్రోను ఏవిధంగా అయితే కేంద్రం, రాష్ట్రం కలిసి అమలు చేసిందో అదే విధంగా రెండో విడత కూడా అమలు చేయాలని తాము కోరుకుంటున్నామని, అదే విషయాన్ని ప్రధానికి వివరించానని సీఎం చెప్పారు. 2021-22 బడ్జెట్‌లో చెన్నై రైల్ ఫేస్-2 ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారని, 2022లో కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇంతవరకూ, 18,564 కోట్లను పనుల కోసం వెచ్చించామని, అయితే తమిళనాడు కేంద్ర మంత్రి నుంచి అనుమతి పెండింగ్‌లో ఉన్నందున కేంద్రం నుంచి నిధులు తమకు రాలేదని చెప్పారు. దీంతో మెట్రో రైల్ ప్రాజెక్టు నత్తనడక నడుస్తోందని చెప్పారు. ఆ కారణంగా ఎలాంటి జాప్యం లేకుండా నిధులు విడుదల చేయాలని ప్రధానిని కోరినట్టు చెప్పారు. తమిళ మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలని, సమగ్ర శిక్షా పథకం కింద కేంద్ర నిధులను తమిళనాడుకు విడుదల చేయాలని కూడా కోరినట్టు తెలిపారు.
Read More National News and Latest Telugu News
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Sep 27 , 2024 | 04:43 PM