ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tamilnadu Politics: ఎన్టీఆర్ స్పూర్తితోనే.. విజయ్ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Oct 27 , 2024 | 07:08 PM

తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ తమిళ హీరో విజయ్ ఆదివారం విళుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని వి.సాలైలో మొదటి రాష్ట్ర మహానాడును నిర్వహించారు. ఈ సందర్బంగా హీరో విజయ్ మాట్లాడుతూ...2026లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో తమను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలపై తమకు అచంచలమైన విశ్వాసం ఉందన్నారు. ఈ సందర్బంగా డీఏంకే, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

చెన్నై, అక్టోబర్ 27: తనను సినిమా ఆర్టిస్ట్ అంటూ కొందరు పేర్కొంటున్నారని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ తమిళ హీరో విజయ్‌ పేర్కొన్నారు. అయితే తమిళనాట ఎంజీఆర్.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారని ఈ సందర్భంగా విజయ్ గుర్తు చేశారు. ఆదివారం విళుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని వి.సాలైలో మహానాడును విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

Also Read: Telangana Politics: శుద్ధపూసలా మాట్లాడుతున్న కడియం శ్రీహరి


ఈ మహాసభకు లక్షలాది మంది ప్రజలు, విజయ్ అభిమానులు పోటెత్తారు. ఈ సందర్బంగా హీరో విజయ్ మాట్లాడుతూ.. పెరియార్‌ ఈవీ రామసామి, కె. కామరాజ్‌, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌, వేలు నాచియార్‌, అంజలై అమ్మాళ్‌ వేసిన బాటలోనే తమిళగ వెట్రి కజగం (టీవీకే) పయనిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌ ప్రకటించారు.

Also Read: Viral Video: భలే వాడివి బాసు: చేతులు లేవు... కానీ బండి నడిపి.. ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు


సినిమాల్లో హీరోగా నటిస్తూ తాను అత్యున్నత శిఖరాల్లో అధిరోహించానన్నారు. అలాగే అత్యధిక పారితోషకం తీసుకుంటూ.. మీ అందరిని నమ్మి రాజకీయాల్లోకి వచ్చానని హీరో విజయ్ వెల్లడించారు. తన ఈ రాజకీయ ప్రయాణంలో మహిళలు కీలక పాత్ర పోషించబోతున్నారని తెలిపారు. అయితే నీట్ సమస్య కారణంగా చనిపోయిన అరియలూరు విద్యార్థిని అనిత ఆత్మహత్యను ఈ సందర్భంగా హీరో విజయ్ గుర్తు చేసుకున్నారు.

Also Read: AP Politics: జగన్‌కి ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా ?


ఈ ప్రసంగంలో భాగంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకేతోపాటు కేంద్రంలోని బీజేపీపై విజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఈ సభ ప్రారంభంలో హీరో విజయ్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. రాజకీయాల్లో మనం చిన్నపిల్లలమంటూ చాలా మంది వ్యాఖ్యానించారన్నారు. కానీ మనం ఆత్మవిశ్వాసంతో రాజకీయం అనే పాముతో ఆడుకునే పిల్లలమని అభివర్ణించారు.

Also Read: రోజు బీరు తాగుతున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలు గ్యారంటీ..


తమిళనాడు అసెంబ్లీకి 2026లో ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో తమను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలపై తమకు అచంచలమైన విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. ఒక వేళ పార్టీలు తమతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే వారికి ప్రభుత్వంలో భాగస్వామిని చేస్తామని టీవీకే అధినేత, హీరో విజయ్ స్పష్టం చేశారు.

For National News And Telugu News

Updated Date - Oct 27 , 2024 | 07:08 PM