Tamilisai: ఆధ్యాత్మికం లేకుండా రాజకీయం లేదు..
ABN, Publish Date - Aug 25 , 2024 | 01:34 PM
తమిళనాట ఆధ్యాత్మికం గురించి మాట్లాడకుండా ఏ ఒక్కరూ రాజకీయాల్లో మనుగడ సాగించలేరని బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్(Senior BJP leader and former Governor Tamilisai Soundarrajan) అన్నారు.
- మాజీ గవర్నర్ తమిళిసై
చెన్నై: తమిళనాట ఆధ్యాత్మికం గురించి మాట్లాడకుండా ఏ ఒక్కరూ రాజకీయాల్లో మనుగడ సాగించలేరని బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్(Senior BJP leader and former Governor Tamilisai Soundarrajan) అన్నారు. ఆమె శనివారం కోవై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, శనివారం నుంచి పళనిలో ప్రారంభమైన మురుగన్ మహానాడుకు తన అభినందనలు తెలిపారు. ఇది ఆధ్యాత్మిక భూమి అని, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడినా ఆధ్యాత్మికం గురించి మాట్లాడకుండా రాజకీయాలు చేయలేమనే విషయాన్ని ముత్తమిళ్ మురుగన్ మహానాడు రుజువు చేస్తుందన్నారు.
ఇదికూడా చదవండి: Alert: ఐఎండీ హెచ్చరిక.. 20 రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..
ఇలాంటి మహానాడును తమిళనాడులో రాష్ట్రప్రభుత్వం నిర్వహించడం చూ స్తుంటే ఆధ్యాత్మికం వైపు ఉన్నట్టు నిరూపిస్తుందన్నారు. ఆధ్యాత్మికం లేకుండా రాజకీయాలు లేవు. రాజకీయం లేకుండా ఆధ్యాత్మికం లేదు అని గాంధీజీ చెప్పినట్టుగా, పెరియార్ సిద్ధాంతాలను, అన్నాదురై తమిళంను అనుసరించే వీరంగా ఆండాళ్ తమిళంను అనుసరించే రోజులు వస్తాయన్నారు. అయి తే, ఈ మహానాడుకు సీఎం స్టాలిన్ స్వయంగా వెళ్లి ప్రారంభించకుండా చెన్నై నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించడం సబబు కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
నటుడు విజయ్ ఆవిష్కరించిన పార్టీ జెండాలో ఉన్నది వాగై పుష్పమా లేక తూంగుమూంజి మరమా (నిద్రగన్నేరు పువ్వా) అనేది స్పష్టం కాలేదన్నారు. మరోవైపు, జెండాలో ఉన్న ఏనుగులు బీఎస్పీకి సొంతమైన ఎన్నికల గుర్తు అని, ఇది న్యాయపరమైన చిక్కులకు దారి తీస్తుందన్నారు. ఇలాంటి విషయాల్లో తమలాంటి రాజకీయ నేతలు తెలియజేసే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకుసాగాలని ఆమె సూచించారు.
................................................................
ఈ వార్తను కూడా చదవండి:
...................................................................
Premalatha: విజయ్ అనేక సవాళ్లను అధిగమించాలి..
- డీఎండీకే చీఫ్ ప్రేమలత విజయకాంత్
చెన్నై: కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించిన సినీ నటుడు విజయ్ మున్ముందు అనేక రాజకీయ సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్(Premalatha Vijayakanth) అభిప్రాయపడ్డారు. ఆమె శనివారం స్థానిక కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు, ఆమె భర్త దివంగత కెప్టెన్ విజయకాంత్ 72వ జయంతిని పురస్కరించుకుని 72 మంది కార్యకర్తల చేతికి విజయకాంత్ టాటూలను వేయించారు.
ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ, తమిళ సినీ రంగం, రాజకీయాల్లో చక్రం తిప్పిన తమ పార్టీ వ్యవస్థాపకుడు విజయకాంత్ జన్మదినాన్ని (ఆగస్టు 25వ తేదీ) పేదరికం నిర్మూలన దినోత్సవంగా జరుపుకోనున్నట్టు తెలిపారు. దారిద్య్ర రేఖకు దిగువున్న వారికి పార్టీ తరపున సంక్షేమ సహాయాలను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు అన్నదానం చేస్తామన్నారు. నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం మంచిదేనని, అయితే, ఆయన ముందు అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. వీటిని విజయవంతంగా ఎదుర్కొని ముందుకు ప్రయాణించాల్సి ఉంటుందన్నారు.
ఆయన సినీ రంగంలో అతిపెద్ద సవాళ్లను అధిగమించారన్నారు. అయితే, రాజకీయాలను సినిమాలుగా భావించకుండా, ఒక్కో అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. దేవుడు లేరని వాదిస్తున్న అధికార డీఎంకే నేతలు ఇపుడు ఆధ్యాత్మికంపై దృష్టి సారించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎట్టకేలకు దేవుడున్నాడని నమ్మకంతోనే రాష్ట్ర ప్రభుత్వం తరపున దిండిగల్ జిల్లా పళనిలో మురుగన్ మహానాడును నిర్వహిస్తున్నారన్నారు. సమయానికి తగినట్టుగా రాజకీయాలను నడపడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News
Updated Date - Aug 25 , 2024 | 01:34 PM